Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదం ఎక్కడ ఉంటే అక్కడ నేనుంటా అనుకునేవారు కొంతమంది అయితే.. అసలు వివాదం పుట్టించాలి అంటే నేనే అనుకున్నవారిలో వర్మ ముందు ఉంటాడు. ముఖ్యంగా టీడీపీ, జనసేనపై ఆయన చేసిన విమర్శలు, ఆయన పుట్టించిన వివాదాలు అన్ని ఇన్ని కావు.
ఒకప్పుడు చాలామంది డైరెక్టర్స్.. తీస్తే వర్మ లాంటి సినిమ తీయాలి అనుకునేవారు. కానీ, ఇప్పుడు వర్మ తీస్తున్న సినిమాలు చూసి.. అసలు ఏం సినిమాలురా బాబు అని ట్రోల్స్ చేస్తున్నారు. వర్మ సినిమాలపై ఫోకస్ చేసి చాలా కాలం అవుతుంది. ఎన్నికలు వస్తున్నాయి అంటే.. రాజకీయ నేతలపై బయోపిక్ లు.. లేకపోతే అమ్మాయిల బాడీ చూపిస్తూ వినిమాలు. ఇవన్నీ చూసి చూసి విసిగిపోయిన ప్రేక్షకులు వర్మను లైట్ తీసుకున్నారు.
Miss You Trailer: పెళ్లి తరువాత లవ్ స్టోరీతో వస్తున్న సిద్దు.. ట్రైలర్ అదిరిపోయిందిగా
ఇక ఈ మధ్యకాలంలో వివాదాల వర్మ కొద్దిగా మెత్తబడ్డాడు. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ అటెన్షన్ గ్రాబ్ చేసే ఈ డైరెక్టర్ తాజాగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. పృథ్వీరాజ్ కేవలం హీరో మాత్రమే కాదు.. డైరెక్టర్, నిర్మాత కూడా. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో లూసిఫర్ 2 సినిమా తెరకెక్కుతుంది.
మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఇక ఈ సెట్ లో వర్మ ప్రత్యక్షమయ్యినట్లు తెలుస్తోంది. డైరెక్షన్ చైర్ లో మైక్ పట్టుకొని పృథ్వీరాజ్ కనిపించగా.. ఆయన పక్కన వర్మ ఫోటో తీస్తూ కనిపించాడు.
Teja Sajja in The Rana Daggubati show: 1000 కోట్లకు ఒకే ఒక్క మొగుడు ప్రభాస్
ఇక ఈ ఫొటోకు క్యాప్షన్ గా .. ” ఒక డైరెక్టర్ అయిన నేను ఒక నటుడు డైరెక్ట్ చేస్తుంటే చూస్తున్నాను. పృథ్వీరాజ్ సార్.. నా ఉద్యోగం కూడా మీరే తీసేసుకుంటే.. మేమేం చేయాలి” అని రాసుకొచ్చాడు. ఇక దీంతో పాటు సినిమా యూనిట్ తో కూడా వర్మ ఫోటో దిగాడు. లూసిఫర్ 2 మేకింగ్ అద్భుతం. బ్లాక్‌బస్టర్ 2 యొక్క అద్భుతమైన యూనిట్‌తో ఇలా అంటూ రాసుకొచ్చాడు. అయితే ఇక్కడ అంతుచిక్కని విషయం ఏంటంటే.. వీరిద్దరూ ఎందుకు కలిశారు.. ? పృథ్వీరాజ్ సినిమాలో వర్మ ఏదైనా పాత్రలో నటిస్తున్నాడా.. ? లేక అనుకోకుండా కలిశారా.. ? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
Me the DIRECTOR watching an ACTOR direct ..Sir @PrithviOfficial ,if you take away our job also, what will we do? 😢😢😢 pic.twitter.com/mvb842eeU3
— Ram Gopal Varma (@RGVzoomin) November 23, 2024