Big Stories

Robert Vadra Comments: ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంకా గాంధీ భర్త

Robert Vadra Comments : కాంగ్రెస్ కు కంచుకోట అయినటువంటి అమేథీ నుంచి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్నారనే టాక్ గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

- Advertisement -

అయితే, రాబర్ట్ వాద్రా తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజలు తనను వారి ప్రాంతాల్లో ఉండాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా తాను 1999లోనే అమేథీ ప్రచారంలో పాల్గొన్నానంటూ వాద్రా పేర్కొన్నారు. ఎంపీ స్మతి ఇరానీ మాత్రం ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని ఆయన అన్నారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందన్నారు. బీజేపీతో ప్రజలు విసిగిపోయారని.. ఈ నేపథ్యంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. గాంధీ కుటుంబం వెంటే దేశ ప్రజలు ఉన్నారని ఆయన అన్నారు.

- Advertisement -

Also Read: ‘నేను జర్మనీ నుంచి వచ్చి ఓటు వేశా’

అమేథీ స్థానానికి బీజేపీ నుంచి స్మతి ఇరానీ పోటీ పడుతున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే, గత కొద్దిరోజులుగా ఈ ఎంపీ స్థానాన్ని రాబర్ట్ వాద్రాకు కాంగ్రెస్ కేటాయించనున్నదంటూ ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు సాయంత్రం అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News