గతంలో ఉగ్రఘాతుకాలను చాలానే చూశాం. దయాదాక్షిణ్యం లేకుండా బుల్లెట్ల వర్షం కురిపించే కసబ్ లాంటి కిరాతకుల ఉదంతాలు కూడా మనకు తెలుసు. కానీ ఈసారి పహల్గాంలో జరిగిన దాడు అన్నిటికీ మించిన దారుణ మారణకాండగా చరిత్రలో నిలిచిపోయేలా ఉంది. పేరు అడిగి మరీ, ఫలానా మతం అని నిర్థారించుకుని బుల్లెట్ల వర్షం కురిపించారు దుర్మార్గులు. అదే సమయంలో కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఉద్దేశపూర్వకంగానే వదిలిపెట్టినట్టు తెలుస్తోంది. ఆ దుర్మార్గానికి వారు ప్రత్యక్ష సాక్షులుగా నిలవాలనే క్రూరమైన ఆలోచన వారిది.
బుల్లెట్ల వర్షం..
పహల్గాం దాడికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బుల్లెట్ల వర్షాన్ని కొందరు అనుకోకుండా కెమెరాల్లో బందించారు. సుదూరంగా ఉన్న వారు సుందర దృశ్యాలను చిత్రీకరించేందుకు ఫోన్ కెమెరా ఆన్ చేశారు. అయితే అందులో తూటాల సౌండ్ రికార్డ్ అయింది. మారణాయుధాలు ధరించిన తీవ్రవాదులు.. టూరిస్ట్ లపై తుపాకి గుళ్లు కురిపించారు. ఆ శబ్దం తాలూకు ప్రతిధ్వనులు కాశ్మీర్ లోయల్లో మారు మోగాయి.
27 మంది హిందువులను కాల్చి చంపినప్పుడు
1. హిందువుల సంరక్షకుడు (self proclaimed) ఎక్కడ ఉన్నాడో తెలుసా..!?
ముస్లిం కంట్రీ లో జల్సాలు చేస్తున్నాడు…
2. ముస్లింల సంరక్షకుడు US లో ఎంజాయ్ చేస్తున్నాడు
3. దేశ హోమ్ మంత్రి – No use – Ignore
లంచ్ లో ఇది తిని డైజెస్ట్ చేసుకోండి…!! pic.twitter.com/b7f8PMUfGz
— ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@Bezawada_Alludu) April 23, 2025
మమ్మల్ని వదిలేయండి..
తీవ్రవాదులు భారతీయ ఆర్మీ జవాన్లను పోలిన దుస్తులు వేసుకుని టూరిస్ట్ లపై కాల్పులు జరిపారు. దీంతో వారు హడలిపోయారు. ఆ తర్వాత నిజమైన జవాన్లు వారికి రక్షణగా వచ్చినా బాధితులు భయపడిపోయారు. మమ్మల్ని వదిలేయండి, మా బిడ్డల్ని వదిలేయండి అంటూ వారిని వేడుకున్నారు. మేం జవాన్లం, భారతీయ జవాన్లం, మిమ్మల్ని కాపాడ్డానికి వచ్చాం, మీకు రక్షణగా ఉంటామని వారు వివరించడంతో అప్పుడు స్థిమితపడ్డారు. తమ వివరాలను తెలిపేందుకు కూడా వారు భయపడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాల్పుల ఘటన తర్వాత టూరిస్ట్ లు భయంతో పరిగెట్టే దృశ్యాలు, గుంపులుగా చేరి బాధతో ఆర్తనాదాలు పెట్టే దృశ్యాలు కలచి వేసేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దృశ్యాలు చూసి చాలామంది తమ బాధ వ్యక్తం చేస్తున్నారు. ముష్కరుల ఆట కట్టించాల్సిందేనని కామెంట్లు పెడుతున్నారు.
Why is it always Hindus who are massacred ?
If you don't know the answer yet, you will not know the answer ever.#PahalgamTerroristAttack
pic.twitter.com/fVyy4VToMu— Kashmiri Hindu (@BattaKashmiri) April 23, 2025
పహల్గాం దాడిని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ఈ దాడిలో దాదాపు 27మంది అమాయక టూరిస్ట్ లు చనిపోయారు. కొత్తగా పెళ్లైనవారు, హనీమూన్ కి వచ్చినవారు, మలిసంధ్యలో విహారయాత్రకు వచ్చినవారు.. నేలకొరిగారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు. ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లో ఒక్కసారిగా తీవ్రవాదులు చెలరేగడంతో యావత్ భారత దేశం షాక్ కి గురైంది. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాశ్మీర్ విషయంలో కేంద్రం ఇటీవల ఉదాసీనంగా ఉందని, శత్రు దేశం హెచ్చరికల్ని కూడా పట్టించుకోలేదని, ఈ ఉదాసీనతకు ఇప్పుడు సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, వాటి కింద కామెంట్లు చదివితే.. భారతీయులు ఎంతలా ఆవేదన చెందుతున్నారో అర్థమవుతుంది. తీవ్రవాదుల ఫొటోలు కూడా ఇప్పుడు అధికారికంగా విడుదల కావడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. భారత ప్రభుత్వం ఇకనైనా ఉదాసీన వైఖరి విడనాడాలని అంటున్నారు.