BigTV English
Advertisement

OTT Movies : వణుకు పుట్టించే సీన్లతో హారర్ మూవీ.. ఒంటరిగా చూస్తే గుండె ఆగిపోతుంది.. డోంట్ మిస్..

OTT Movies : వణుకు పుట్టించే సీన్లతో హారర్ మూవీ.. ఒంటరిగా చూస్తే గుండె ఆగిపోతుంది.. డోంట్ మిస్..

OTT Movies : తెలుగులో వచ్చే హారర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నో హారర్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకున్నాయి. ఓటీటీలో వస్తున్నా సినిమాలపై మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య తెలుగులో వణుకు పుట్టించే సన్నివేశాలు ఉన్న సినిమాలు చాలానే వచ్చాయి. అందులో ఓ మూవీ ఇప్పుడు మళ్లీ ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.. ఆ మూవీ పేరేంటి? స్ట్రీమింగ్ ఎక్కడో? ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..


మూవీ & ఓటీటీ..

తెలుగులో ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనం సృష్టించిన హారర్ మూవీ మసూద.. ఈ మూవీ థియేటర్లలో మంచి సక్సెస్ టాక్ ను అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే వసూలు చేసింది. థియేటర్లలోకి వచ్చి మూడేళ్లయిన తర్వాత ఈ మూవీ మరోసారి ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మంగళవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. మసూద స్ట్రీమింగ్ వివరాలను అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఆహా ఓటీటీలో మసూద అందుబాటులో ఉంది. ఈ మూవీలో తిరువీర్‌, సంగీత, బాంధవి శేఖర్‌, కావ్య కళ్యాణ్‌రామ్ కీలక పాత్రలు పోషించారు. సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. మామూలుగా వచ్చే హారర్ సినిమాలకు భిన్నంగా ఉండాలని ఇలాంటి కథను దర్శకుడు ఎంచుకొని తన సత్తాను నిరూపించుకున్నాడు. ఈ సినిమా స్టోరీ తో పాటు మ్యూజిక్ కూడా హైలెట్ అయింది. వెన్నులో వణుకు పుట్టించేలా బిజిఎం ఉండడంతో సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది..


Also Read : ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం..గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఇవ్వొచ్చు..!

స్టోరీ విషయానికొస్తే..

ఈ మూవీలో నీలమనే ఆవిడ భర్తకు దూరంగా తన కూతురు నాజియాతో కలిసి ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటుంది. అదే అపార్ట్మెంట్లోకి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన ప్రియురాలతో కలిసి అద్దెకు ఉంటాడు. కానీ తన ప్రేమను మినీకి చెప్పడానికి భయపడుతుంటాడు. నీలమ్ కూతురు నాజియాకు దయ్యం పట్టడంతో వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఆ దెయ్యం బారి నుంచి తన కూతురిని రక్షించుకోవడానికి గోపి సహాయం కోరుతుంది నీలమ్‌. అతి భయస్తుడైన గోపీ ఆ దెయ్యం నుంచి నాజియాకు విముక్తి కల్పించాడా? నాజియా కు పట్టిన ఆ మాసూద ఎవరు? ఆమె ఎందుకు నాజియాను ఆవహించింది అనేది ఈ సినిమా స్టోరీ.. ఈ మూవీని కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో మాత్రమే నిర్మించారు. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ ని అందుకున్న ఈ మూవీ దాదాపు 13 కోట్లకు పైగా వసూలు చేసింది.. ఇప్పుడు మరోసారి ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. తెలుగులో వచ్చిన సినిమా కావడంతో ఈ మూవీ పై ఆసక్తి పెరుగుతుంది..

Tags

Related News

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : అడవిలో వేలాడే తల లేని శవం… తవ్వుతున్న కొద్దీ బయటపడే నేరాల చిట్టా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 16 ఏళ్ల అబ్బాయికి అతీంద్రీయ శక్తులు… దయ్యాల ఆవాసంగా మారే అపార్ట్మెంట్… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : భార్య చనిపోవడంతో మరో అమ్మాయితో… దెయ్యం పాపతో ఆ పనులేంటి భయ్యా ?

Chiranjeeva Movie Review : ‘చిరంజీవ’ మూవీ రివ్యూ : షార్ట్ ఫిలింని తలపించే ఓటీటీ సినిమా

Jana Nayagan OTT: భారీ ధరలకు జననాయగన్ ఓటీటీ రైట్స్… తమిళ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!

The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Big Stories

×