E-Paper
Advertisement

Chennai: అప్పుడు టీడీపీ కోసం.. విజయ్ క్యాబినెట్‌లో మంత్రిగా కీర్తన, ప్రపంచానికి చూపించబోతున్నామని వ్యాఖ్య

Chennai: అప్పుడు టీడీపీ కోసం.. విజయ్ క్యాబినెట్‌లో మంత్రిగా కీర్తన, ప్రపంచానికి చూపించబోతున్నామని వ్యాఖ్య
Advertisement

Chennai: తమిళనాడు రాజకీయాల్లో టీవీకే ప్రభుత్వ పాలన శకం మొదలైంది. నిన్నటి వరకు ఏపీలో టీడీపీ విజయానికి తెర వెనుక వ్యూహాలు రచించిన మహిళా యువతి, ఏకంగా విజయ్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. రాజకీయ వ్యూహకర్త స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన కీర్తన అందరి దృష్టిని ఆకట్టుకుంది. కేబినెట్‌లో అతి చిన్న వయస్సు గల మహిళా మంత్రిగా రికార్డులకెక్కారు.

అప్పుడు టీడీపీ కోసం.. విజయ్ క్యాబినెట్‌లో మంత్రిగా కీర్తన

Advertisement

ఆదివారం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. అందులో కీర్తన కూడా ఒకరు. ఈ కార్యక్రమం తర్వాత న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన కీర్తన, కొత్త ప్రభుత్వం పాలనలో ఒక ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

మరే ఇతర రాష్ట్రంలో ఇలాంటి క్యాబినెట్ మంత్రి ఉండరని, మాకు ఎవరూ ఇలాంటి అవకాశం ఇవ్వరని తేల్చేశారామె. ప్రభుత్వాన్ని ఎంత బాగా నడపుతామో తాము ప్రపంచానికి చూపించబోతున్నామని వ్యాఖ్యానించారు. ఎవరీ కీర్తన? తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని శివకాశి నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా కీర్తన గెలిచారు.

Advertisement

ప్రభుత్వాన్ని ఎంత బాగా నడపుతామో ప్రపంచానికి చూపిస్తాం-మంత్రి కీర్తన

దేశ బాణసంచా రాజధానిగా ఆ నియోజకవర్గానికి పేరుంది. ఆరు దశాబ్దాల చరిత్రలో ఆ స్థానం నుంచి తొలిసారి ఎన్నికైన మహిళగా రికార్డులకు ఎక్కారు. అంతేకాదు కేబినెట్‌లో చిన్న వయస్సు గల మహిళా మంత్రిగా నిలిచారు. తమిళనాడుకు చెందిన కీర్తన బహు భాషలను అనర్గళంగా మాట్లాడగల సత్తా ఆమె సొంతం. తమిళం, ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషపై పట్టు పెంచుకుని అందరి దృష్టిని ఆకట్టుకుంది.

రాజకీయాల్లోకి రాక ముందు కీర్తన రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు.  షోటైమ్ కన్సల్టింగ్ టీమ్‌లో పని చేశారు. 2024 ఎన్నికల వేళ ఏపీలో టీడీపీ కోసం ఆమె పని చేశారు. టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను సోషల్‌మీడియా ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అంతేకాదు డేటా విశ్లేషణతో నియోజకవర్గాల వారీగా ప్రచార వ్యూహాలను రూపొందించారు. పార్టీ కోసం యువతను సమీకరించడంలో ఆమెది కీలక పాత్ర.

ALSO READ: కర్ణాటక రాజకీయాల్లో తీరని లోటు.. మంత్రి సుధాకర్ కన్నుమూత!

ఏపీలో పనితీరు తమిళనాడు రాజకీయాల్లో రాణించడానికి ఆమెకు సునాయాశమైంది. దీని ద్వారా కీర్తన రాజకీయాల్లోకి రాలేదు. తన నియోజకవర్గంలో మహిళలను నిత్యం ప్రొత్సహిస్తూ ఉండేవారు. ఆ విధంగా మహిళల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఆమె చేస్తున్నప్రచారాన్ని గమనించిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్, శివకాశి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. మొదటిసారి విజయం సాధించడమేకాదు విజయ్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వారసత్వ రాజకీయాలకు భిన్నంగా యువత రాజకీయాల్లో రాణించవచ్చని చెప్పడానికి కీర్తన ఒక ఉదాహరణ.

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×