BigTV English

Arvind Kejriwal: ఎన్నికల్లో గెలిచేందుకు ఆ పార్టీ ఏదైనా చేస్తుంది .. బీజేపీ పై కేజ్రీవాల్‌ ఫైర్‌..

Arvind Kejriwal: ఎన్నికల్లో గెలిచేందుకు ఆ పార్టీ ఏదైనా చేస్తుంది .. బీజేపీ పై కేజ్రీవాల్‌ ఫైర్‌..

Delhi CM Arvind Kejriwal fire on BJP: చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు నేపథ్యంలో బీజేపీపై ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఏదైనా చేస్తుందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో ప్రసంగించిన కేజ్రీవాల్ బీజేపీ నిజస్వరూపాన్ని దేవుడే ప్రజల ముందు ఉంచాడన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.


ఎన్నికల్లో బీజేపీ గెలవదనే ఘటన చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక నిరూపించిందని కేజ్రీవాల్ అన్నారు. జనవరి 30 నాటి ఎన్నిక ఫలితాన్ని పక్కనపెడుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిందన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాషాయ పార్టీ ఏదైనా చేస్తుందన్నారు.

ఎమ్మెల్యేలకు ఎరవేయడం, ప్రభుత్వాలను బహిరంగంగానే కూల్చే ప్రయత్నాలకు పాల్పడుతోందని బీజేపీపై కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ పార్టీ అధికారం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేసినా చివరికీ ధర్మమే గెలుస్తుందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.


Read more: కాంగ్రెస్‌తో ఎలాంటి విభేదాలు లేవు.. ‘ఆల్ ఈజ్ వెల్’

ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలపై స్పందించిన ఆయన కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రైతులను నగరంలోకి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధర కల్పించకపోవడమే కాక వారి సమస్యలను కూడా వినడం లేదని కేజ్రీవాల్ విమర్శించారు.

Related News

Solar Storm: భూమికి మరో ముప్పు.. ముంచుకోస్తున్న సౌర తుఫాన్..

India Post: బిగ్ షాకిచ్చిన పోస్టల్.. అక్కడికి అన్నీ బంద్.. వాట్ నెక్స్ట్!

NEET Student Incident: మార్కుల ఒత్తిడి.. బిల్డింగ్ పైకి ఎక్కి నీట్ స్టూడెంట్..

September Holidays: సెప్టెంబర్‌లో సగం రోజులు సెలవులే.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Jammu Kashmir Cloudburst: జమ్ము కశ్మీర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 11మంది మృతి, పలువురికి గాయలు..

Chief Ministers: అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా మూడో స్థానంలో చంద్రబాబు

Big Stories

×