Big Stories

Yashasvi Jaiswal: ఐసీసీ ర్యాంకుల్లో దూసుకెళ్లిన యశస్వి జైశ్వాల్..!

Yashasvi Jaiswal Climbs Into Top 15 In ICC Test Rankings: టీమ్ ఇండియాలో చిచ్చర పిడుగ్గా మారిన 22 ఏళ్ల యశస్వి జైశ్వాల్ ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో తారాజువ్వలా దూసుకెళ్లిపోయాడు. తన కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంక్‌ని అందుకున్నాడు.

- Advertisement -

వరుసగా రెండు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన యశస్వి 699 పాయింట్లు సాధించి ఏకంగా 14 ర్యాంకులు ముందుకి వచ్చాడు. ప్రస్తుతం 15వ స్థానంలో ఉన్నాడు. బ్యాటింగ్ జాబితాలో విరాట్ కొహ్లీ 752 పాయింట్లతో టాప్ టెన్‌లో కొనసాగుతున్నాడు.

- Advertisement -

ఇంగ్లాండ్‌తో ఇంకా రెండు టెస్టు మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. వీటిల్లో ఏమైనా మరో డబుల్ సెంచరీ చేస్తాడా? లేక సెంచరీలు చేస్తాడా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యశస్వి తనదైన శైలిలో దూకుడుతో ఆకట్టుకుంటున్నాడు. ఒకవైపు శుభ్‌మన్ గిల్ ఒకొక్క పరుగు చేయడానికి అవస్థలు పడుతుంటే, తను అలవోకగా ఆడేస్తున్నాడు. అటూ,ఇటూ ఫోర్లు, సిక్స్‌లు బాదేస్తున్నాడు.

Read More: భారత సంతతి బుడతడు.. చెస్‌లో చిచ్చరపిడుగు..

ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో నెంబర్ వన్ స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 893 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తను కూడా అద్భుతమైన ఫామ్‌తో చెలరేగిపోతున్నాడు. ఇటీవల కాలంలో ఏడు సెంచరీలు చేసి, ఔరా అనిపించాడు. ఇదే దూకుడుతో వెళితే టీ 20 ప్రపంచకప్ నాటికి కివీస్ ను అడ్డుకోవడం కష్టమేనని నెటిజన్లు వ్యాక్యానిస్తున్నారు.

ఇక బౌలింగ్ విభాగానికి వస్తే రాజ్ కోట్ టెస్ట్ లో సెంచరీ చేసిన రవీంద్ర జడేజా బ్యాటింగ్ ర్యాంకులను కూడా మెరుగు పరుచుకున్నాడు. 34వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్ రౌండర్ కాబట్టి బౌలింగ్ విభాగంలో మూడు స్థానాలు పైకి వచ్చి, ఆరో ర్యాంకు సాధించాడు. 

ఈ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా (876), అశ్విన్ (839) పాయింట్లు సాధించి మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఆల్ రౌండర్ల జాబితాలో చూస్తే రవీంద్ర జడేజా (469) పాయింట్లతో తనదే అగ్రస్థానం. రెండో ర్యాంకులో అశ్విన్ (330), నాలుగో స్థానంలో అక్షర్ పటేల్ (281) స్థానాల్లో ఉన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News