BigTV English

One Nation One Election | జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ కీలక నిర్ణయం.. ప్రజా సూచనల ఆహ్వానం

One Nation One Election | తాజాగా రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ శనివారం జమిలి ఎన్నికల నిర్వహణపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు చర్యలు ప్రారంభించింది.

One Nation One Election | జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ కీలక నిర్ణయం.. ప్రజా సూచనల ఆహ్వానం

One Nation One Election | మరో మూడు నెలలోపు జరగబోయే లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల (ఒకే దేశం ఒకే ఎన్నిక) గురించి గతంలో పలుమార్లు ప్రస్తావించింది. అందుకోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జమిలి ఎన్నికల నిర్వహణ, ప్రజాభిప్రాయం గురించి అధ్యయనం చేసి ఇచ్చే నివేదిక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.


తాజాగా రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ శనివారం జమిలి ఎన్నికల నిర్వహణపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రజల నుంచి సూచనలు ఆహ్వానించింది. ఇందుకోసం చట్టపరమైన పరిపాలన నిబంధనలలో మార్పులపై ప్రజలు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఒక ప్రకటనలో కోరింది.

ఈ సూచనలు చేసేందుకు జనవరి 15 వరకు గడువు విధించింది. సూచనలు చేసేందుకు onoe.gov.in లేదా sc-hlc@gov.in అనే ఈ మెయిల్ ఐడీకి మెయిల్ పంపించాలి.


జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు గతేడాది సెప్టెంబరులో ఈ కోవింద్ కమిటీ ఏర్పాటైంది. ఇప్పటికే రెండు సార్లు సమావేశాలు నిర్వహించింది. న్యాయ కమిషన్ నుంచి సలహాలు తీసుకొంది. రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కూడా కోరింది.

Kovind Committee, Ramnath Kovind, inivite, public suggestions, One Nation One Election, Modi govt,

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×