BigTV English

Nara Lokesh : అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం.. జగన్ పరాకాష్టకు నిదర్శనం..

Nara lokesh : అంగన్ వాడీ పై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం, వారి జీవితాల్లో కోత వేయడం జగన్ నియంత పోకడలకు పరాకాష్ఠ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుందని ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు.

Nara Lokesh : అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం.. జగన్ పరాకాష్టకు  నిదర్శనం..

Nara Lokesh : అంగన్ వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం, వారి జీతాల్లో కోత వేయడం జగన్ నియంత పోకడలకు పరాకాష్ఠ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుందని ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు.


జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. అంగన్ వాడీలు శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా? అని ప్రశ్నించారు. అంగన్వాడీ వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని గత 26 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారన్నారు. వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి అంగన్వాడీ ఉద్యమంపై సైకో సర్కార్ ఉక్కుపాదం మోపడం దారుణమని లోకేశ్ విమర్శించారు.

అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీఓ నెంబర్ 2 తక్షణమే ఉపసంహరించుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని లోకేశ్ ట్వీట్ లో పేర్కొన్నారు. జగన్ అహంకారానికి..అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఉద్యమంలో అంతిమ విజయం అంగన్వాడీలదేనన్నారు.


సీఎం జగన్‌కు ప్రచార పిచ్చి పెరిగిపోయిందని నారా లోకేశ్‌ విమర్శించారు. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకునే మరుగుదొడ్ల వద్ద ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ మూత్రశాల, మరుగుదొడ్లు అంటూ పలు ప్లెక్సీలు వేశారు. ఆ ప్రాంతాల్లో కనిపిస్తోన్న ఫ్లెక్సీల ఏర్పాటుపై లోకేశ్‌ వ్యంగ్యంగా స్పందించారు. ప్రజల కోసం ప్రభుత్వం ఫలానా పని చేసిందని చెప్పేందుకు ఏమీ లేకపోవడంతో ఇలా ఫ్లెక్సీలు పెడుతున్నారని లోకేశ్ విమర్శించారు.

సీఎం జగన్‌ ప్రచారం చేసుకునేందుకు ఇంకా ఏమైనా మిగిలాయేమో వెతుక్కో.. అని లోకేశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక రోజుకొక్కరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. ఇది ఏమీ పట్టనట్టు చివరకు ఇలా ఫ్లెక్సీలు కట్టుకుంటూ పోతున్నారని లోకేశ్‌ మండిపడ్డారు.

Tags

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×