BigTV English

Lakshadweep: లక్షద్వీప్ కోసం ఇంటర్నెట్ లో సెర్చింగ్.. 20 ఏళ్లలో ఇదే రికార్డు..

Lakshadweep: లక్షద్వీప్ కోసం ఇంటర్నెట్ లో సెర్చింగ్.. 20 ఏళ్లలో ఇదే రికార్డు..

Lakshadweep : ప్రధాన మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం పర్యాటకులు చూపు అంతా లక్షద్వీప్ లోపైనే పడింది. లక్షద్వీప్ లు ప్రాంతం కోసం ఇంటర్నెట్ లో భారీగా శోధిస్తున్నట్టు పలు రిపోర్ట్ లు వెల్లడించాయి. లక్ష దీవుల కోసం ఆన్‌లైన్‌లో అన్వేషిస్తున్న వారి సంఖ్య ఇరవై ఏళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం ప్రకటించింది. ప్రధాన మంత్రి మోదీ లక్షద్వీప్‌ల పర్యటన విషయాలు తన ఎక్స్ ఖాతాలో ఇటీవలే పోస్ట్ చేశారు. దీంతో లక్షద్వీపం కోసం పర్యాటకులు శోధిస్తున్నారు. మరోవైపు తమ వెబ్‌సైట్‌లో లక్షద్వీప్‌ కోసం వెతుకుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థ మేక్‌ మై ట్రిప్‌ ప్రకటించింది .


ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కవరత్తి దీవిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంతోపాటు ఇతర ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఓ బీచ్‌లో ప్రధాని మోదీ కొన్ని గంటలపాటు సేద తీరు ఫోటోలు తీసుకున్నారు . ప్రధాని మోదీ ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

లక్షద్వీప్‌లు అద్భుతమైన ప్రదేశం అని కొనియాడారు. సాహసాలు చేయాలనుకునేవారు లక్షద్వీప్‌ను కూడా జాబితాలో చేర్చుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో ఆన్‌లైన్‌లో లక్షద్వీప్‌ కోసం శోధించే వారి సంఖ్య విపరితంగా పెరిగింది. కేవలం శుక్రవారం రోజే 50వేల మంది లక్షద్వీప్ లు కోసం గూగుల్‌లో వెతికినట్లు కేంద్ర సమాచార సంస్థ ప్రకటించింది. లక్షద్వీప్ కోసం వెతకడం 20 ఏళ్లలో ఇదే అత్యధికమని కేంద్ర ప్రభుత్వ డిజిటల్‌ విభాగం తోపాటు ఆల్‌ఇండియా రేడియో, డీడీ న్యూస్‌లు ప్రకటించాయి.


లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ పర్యటన తర్వాత ఆన్‌లైన్‌ లో భారత దీవుల కోసం వెతికే వారి సంఖ్య 3400శాతం పెరిగింది అని ప్రకటించింది. భారత్‌ బీచ్‌లపై పర్యాటకులు చూపిస్తోన్న ఆసక్తి కొత్త కార్యక్రమాలు రూపొందించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఎక్స్‌వేదికగా మేక్‌ మై ట్రిప్‌ ప్రకటించింది. అయితే మాల్దీవుల నేతలు ప్రధాని చేసిన వ్యాఖ్యలతో భారత పర్యాటకులు మాల్దీవుల పర్యటన రద్దు చేసుకోవాలని పిలుపు నిచ్చారు.

ఈ నేపథ్యంలో లక్షద్వీప్‌లో పరిశుభ్రత తక్కువని మాల్దీవుల మంత్రులు ఆరోపణలు చేశారు. ఈ అంశంపై అక్కడి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. మాల్దీవుల ప్రభుత్వం అనుచిత ఆరోపణలు చేసిన ముగ్గురు నేతల పదవుల నుంచి తొలగించింది.

Tags

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×