Big Stories

Lalu Prasad Daughter assets: అప్పుడు తండ్రికి కిడ్నీ ఇచ్చి వార్తల్లో నిలిచిన లాలూ కూతురు.. ఇప్పుడు మళ్లీ..

Lalu Prasad Daughter Rohini Acharya assets: గతంలో తన తండ్రికి కిడ్నీ దానం చేసి అప్పుడు వార్తల్లో నిలిచిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కూతురు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. బీహార్ లో సారణ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆమె ప్రస్తుతం వార్తల్లో ప్రధానంగా కనిపిస్తున్నారు.

- Advertisement -

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు తన తండ్రికి కిడ్నీని దానం చేసి అప్పుడు వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా కూడా ఆమె వార్తల్లో ప్రధానంగా కనిపిస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య వృత్తి రీత్యా వైద్యురాలు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఆమె ఇప్పుడు బీహార్ లోని సారణ్ లోక్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. దాఖలు చేసిన నామినేషన్ లో తన ఆస్తులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దీంతో ఆమె ప్రస్తుతం వార్తల్లో ప్రధానంగా కనిపిస్తున్నారు.

- Advertisement -

మహాకూటమి అభ్యర్థిగా రోహిణి ఆచార్య నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె తనకు రూ. 15.82 కోట్ల స్థిర, చర ఆస్తులున్నాయని, అదేవిధంగా తన భర్తకు రూ. 19.86 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులున్నాయని అందులో నామినేషన్ పత్రాలలో పేర్కొన్నదని.. అలాగే తన వద్ద రూ. 20 లక్షల నగుదు ఉన్నదని, ఆమె భర్త వద్ద రూ. 10 లక్షల నగదు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె మరోసారి వార్తల్లో ప్రధానంగా కనిపిస్తున్నారు.

Also Read: జైలులో ఉన్న కేజ్రీవాల్.. ఆ మాట విని ఎంతో సంతోషించారంటా!

ఇదిలా ఉంటే.. వచ్చే నెల 20న ఐదవ దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా సారణ్ లో పోలింగ్ జరగనున్నది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తుండడంతో సారణ్ లో పోటీ కీలకంగా మారింది. ఇదే నియోజకవర్గం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా గతంలో ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. అయితే, గతంలో తన తండ్రికి కిడ్నీని దానం చేసి వార్తల్లో నిలిచిన రోహిణి… ఇప్పుడు కూడా మరోసారి వార్తల్లో నిలిచారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News