BigTV English

Kejriwal’s health is fine, Says Punjab CM: జైలులో ఉన్న కేజ్రీవాల్.. ఆ మాట విని ఎంతో సంతోషించారంటా!

Kejriwal’s health is fine, Says Punjab CM: జైలులో ఉన్న కేజ్రీవాల్.. ఆ మాట విని ఎంతో సంతోషించారంటా!

Arvind Kejriwal’s health is fine, Says Punjab Chief Minister: ప్రస్తుతం జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చాలా సంతోషించారంటా. పంజాబ్ ముఖ్యమంత్రి ఆయనను జైలులో కలిసి ఓ విషయాన్ని తెలియజేయగా ఆయన ఎంతోగానో ఆనందపడ్డారని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆయనతో ప్రస్తావించిన పలు అంశాల గురించి కూడా ఆయన తెలియజేశారు.


అయితే, ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మంగళవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కలిశారు. కేజ్రీవాల్ ను కలిసిన అనంతరం భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ ఆరోగ్యగంగా ఉన్నారని తెలిపారు. ఇన్సులిన్ తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు తన అరెస్ట్ విషయమై ఆందోళన చెందొద్దని.. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అదేవిధంగా ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారని.. అదేవిధంగా లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు చురుగ్గా ప్రచారం చేయాలని తమకు సూచించారని భగవంత్ మాన్ తెలిపారు.

ఇటు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల గురించి కూడా తనను అడిగారని.. ఈ సందర్భంగా పంజాబ్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన 158 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారని తాను కేజ్రీవాల్ కు చెప్పగా.. ఆ మాట విన్న కేజ్రీవాల్ ఎంతో సంతోషించారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవల గుజరాత్ పర్యటనకు సంబంధించిన అంశాన్ని కూడా కేజ్రీవాల్ తో చర్చించినట్లు తెలిపారు. కేజ్రీవాల్ జైలులో ఉండడగా ఆయనను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కలవడం ఇది రెండోసారి.


Also Read: కర్ణాటకలో తీవ్ర దుమారం.. కీలక నిర్ణయం తీసుకున్న జేడీఎస్

ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయగా.. కేజ్రీవాల్ కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 1 వరకు విధించడంతో ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, కేజ్రీవాల్ ప్రస్తుతం జైలులో ఉన్న నేపథ్యంలో ఆయన తరఫున, పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్.. ఢిల్లీలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆమె ప్రచారం నిర్వహించనున్నారని ఆప్ పార్టీ నేతలు తెలిపిన విషం విధితమే.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×