Big Stories

Lok Sabha Elections 2024- Phase 6 Updates: లోక్‌సభ ఆరో విడత ఎన్నికల పోలింగ్ రేపే..

Lok Sabha Elections 2024- Phase 6 Updates: సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆరో విడత ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే, దేశంలోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రప్రాంతాల్లో పార్లమెంటు ఆరో విడత ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్నది. మొత్తం 58 పార్లమెంటు నియోజకవర్గాలకు శనివారం పోలింగ్ జరగనున్నది.

- Advertisement -

ఢిల్లీ పరిధిలోని మొత్తం 7 నియోజకవర్గాలు, హర్యానాలోని మొత్తం 10 పార్లమెంటు నియోజకవర్గాలకు ఒకే దఫాలో పోలింగ్ జరగనున్నది. వీటితోపాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల మూడో విడతకు సంబంధించి 42 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పోలింగ్ శనివారం జరగనున్నది. మొత్తం 58 స్థానాల్లో 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్నది. అయితే, ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది.

- Advertisement -

ఉతర ప్రదేశ్ – 14, హర్యానా – 10, బీహార్ – 8, పశ్చిమ బెంగాల్ – 8, ఢిల్లీ – 7, ఒడిశా – 6, జార్ఖండ్ – 4, జమ్మూ కాశ్మీర్ – 1 లోక్ సభ స్థానానికి శనివారం పోలింగ్ జరగనున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్నది. భారీ భద్రత నడుమ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

అయితే, ఈ దశలో మొత్తం 11.13 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 5.84 కోట్ల ముంది పురుష ఓటర్లు ఉండగా, 5.29 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా 5,120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నది. అయితే, ఇప్పటివరకు 25 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 428 స్థానాలకు ఓటింగ్ పూర్తయిన విషయం తెలిసిందే.

ఈ ఆరో దశ పార్లమెంటు ఎన్నికల్లో పలువురు ప్రముఖులు పోటీ చేస్తున్నారు. ఒడిశాలోని సంబల్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. ఈశాన్య ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కన్హయ్య కుమార్ కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. రాజౌరీ నుంచి మేనకా గాంధీ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు.

కాగా, దేశంలో ఏడు విడతలుగా పార్లమెంటు ఎన్నికలు నిర్వహిస్తున్నది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే ఐదు విడతల ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఆరో, ఏడో విడత ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. శనివారం ఆరో విడత ఎన్నికల పోలింగ్ జరగనున్నది. మొత్తం 543 ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రానున్నదనేది ఆరోజు తెలియనున్నది.

Also Read: రేవణ్ణను విదేశాలకు పంపిందే దేవెగౌడ : సీఎం సిద్ధరామయ్య

ఇటు ఏపీ, తెలంగాణలో కూడా పార్లమెంటు ఎన్నికలు నిర్వహించింది. పలువురు ప్రముఖులు పోటీ చేసిన విషయం తెలిసిందే. ఏపీలో – 25 ఎంపీ స్థానాలకు, తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. ఇక్కడ కూడా పలువురు ప్రముఖులు పోటీ చేశారు. ఈ పోలింగ్ ఫలితాలు కూడా జూన్ 4న విడుదల కానున్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News