Big Stories

Repolling In Outer Manipur: ఔటర్ మణిపూర్‌లోని ఆ ఆరు పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్.. ఎప్పుడంటే..?

Lok Sabha Elections 2024 Repolling In Manipur: ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఆరు పోలింగ్ కేంద్రాల్లో ఏప్రిల్ 30న రీపోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 26న ఈ ఆరు పోలింగ్ స్టేషన్లలో నాలుగింటిలో ఓటింగ్ పూర్తికాకముందే గుర్తుతెలియని వ్యక్తులు ఈవీఎంలు, వీవీప్యాట్‌లను డ్యామేజ్ చేయడం, ఒక పోలింగ్ స్టేషన్‌లో ఈవీఎం పనిచేయకపోవడం, బెదిరింపుల కారణంగా మరోచోట ఓటింగ్ పూర్తి కాకపోవడంతో రీపోలింగ్ అనివార్యమైంది.

- Advertisement -

ఉఖ్రుల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని నాలుగు పోలింగ్ స్టేషన్‌లు, ఉఖ్రుల్‌లోని చింగై అసెంబ్లీ సీటు, సేనాపతిలోని కరోంగ్‌లలో ఒక్కో స్థానంలో ఓటింగ్ శూన్యమని, ఏప్రిల్ 30న రీపోలింగ్ నిర్వహిస్తామని మణిపూర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది.

- Advertisement -

Also Read: మణిపూర్‌లో దారుణం, పంజా విసిరిన మిలిటెంట్లు

ఏప్రిల్ 26న ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4.84 లక్షల మంది ఓటర్లలో 76.06 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం మణిపూర్ లోక్‌సభ స్థానంతో పాటు మిగిలిన 15 సెగ్మెంట్‌లలో ఏప్రిల్ 19న మొదటి దశలో ఓటింగ్ జరిగింది. కాగా ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలోని ఆరు పోలింగ్ స్టేషన్లలో ఏప్రిల్ 30న రీపోలింగ్ జరగనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News