BigTV English

Celebrations: తెలంగాణ ఆవిర్భావ వేడుకల పూర్తి వివరాలు.. ఇవే

Celebrations: తెలంగాణ ఆవిర్భావ వేడుకల పూర్తి వివరాలు.. ఇవే

Telangana Formation Day Celebrations Details: జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు హాజరుకావాలని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యతోపాటు పలువురు ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానం అందజేసింది. ఇటు సోనియాగాంధీ కూడా ఈ వేడుకలకు హాజరవుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారం అందింది. ఆవిర్భావ వేడుకల వివరాలు ఇలా ఉన్నాయి.


ఉదయం సమయంలో…

జూన్ 2న ఉదయం 9.30 గంటలకు గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు.


ఆ తరువాత పరేడ్ గ్రౌండ్ కు చేరుకుని ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా పోలీస్ బలగాల పరేడ్, మార్చ్ పాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి.

అదేవిధంగా రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ ను ఆవిష్కరిస్తారు.

అనంతరం ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్న సోనియాగాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.

ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, పోలీస్ సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు.

సాయంత్రం సమయంలో..

ట్యాంక్ బండ్ పై సాయంత్రం 6.30 గంటలకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ప్రారంభం కానున్నాయి.

హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ను అక్కడ ఏర్పాటు చేయనున్నారు.

ఈ స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు.

అదేవిధంగా తెలంగాణ కళారూపాల ప్రదర్శనకు అద్దం పట్టే విధంగా కార్నివాల్ నిర్వహిస్తారు. ఈ కార్నివాల్ లో 700 మంది కళాకారులు పాల్గొంటారు.

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.

జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై ఒక చివరి నుంచి మరో చివరి వరకు భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించనున్నారు.

ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు 13.30 నిమిషాల పాటు సాగే పూర్తి నిడివితో ఉన్న ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆలపిస్తారు.

అనంతరం కవి, గీత రచయిత అందెశ్రీని సన్మానించనున్నారు.

ఆ తరువాత 10 నిమిషాల పాటు బాణసంచా కాల్చే కార్యక్రమం నిర్వహించనున్నారు.

– దీంతో వేడుకలు ముగియనున్నాయి.

Related News

TGSRTC Dasara Offer: బస్సెక్కితే బహుమతులు.. దసరాకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

Weather News: నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక.. పిడుగులు పడే ఛాన్స్

Ganja Seized: గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

CM Revanth Reddy: భారీ వర్షాలున్నాయి.. అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్రెడ్డి ఆదేశం

Hydra Commissioner: మంత్రి కొండా సురేఖతో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ..

Telangana New Liquor Shop: తెలంగాణలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

Big Stories

×