BigTV English

Who is Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్ పదవికి పోటీ తప్పదా..? డిప్యూటీపై కన్నేసిన ఇండియా కూటమి!

Who is Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్ పదవికి పోటీ తప్పదా..? డిప్యూటీపై కన్నేసిన ఇండియా కూటమి!

Who will be the Lok Sabha Speaker..?: లోక్‌సభ స్పీకర్ ఎవరు? బీజేపీ తీసుకుంటుందా? మిత్రులకు అప్పగిస్తుందా? ఇదే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. టీడీపీతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆ పార్టీ ఇవ్వవచ్చని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే మోదీ కేబినెట్‌లో తమకు ఫలానా శాఖ కావాలని పట్టు బట్టలేదు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతలకు ఇవ్వాలా? లేక మిత్రులకు ఇవ్వాలా అనే విషయంలో డైలామాలో పడ్డారట కమలనాథులు.


టీడీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకపోయినా ఏపీలో గెలిచిన తమ పార్టీ నేత పురందేశ్వరి, ఒడిషాలోని మహతాబ్ ఇచ్చినా బాగుంటుదనే ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. మరికొందరు మాత్రం బిర్లాను కంటిన్యూ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఎవర్ని తీసుకోవాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు బీజేపీ కీలక నేతలు. జేడీయూకి ఇచ్చినా పర్వాలేదని మరికొందరు భావిస్తున్నారు. ఎన్డీయేలో స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారనేది రెండురోజుల్లో తేలిపోనుంది.

మరోవైపు స్పీకర్ పదవి ఈసారి ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ లేదన్నది ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నమాట. నార్మల్‌గా అయితే స్పీకర్ పదవి అధికార పార్టీ తీసుకుంటే, డిప్యూటీ స్పీకర్ విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఏం జరుగుతుందోనన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ క్రమంలో ఏకగ్రీవానికి ఛాన్స్ లేదన్నది అసలు పాయింట్.


Also Read:  రైతులకు గుడ్ న్యూస్.. నేడు పీఎం కిసాన్ నగదు జమ

ఒకవేళ ఎన్నిక జరిగితే ఇదే తొలిసారి అవుతుంది. గతంలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారే స్పీకర్ పదవి తీసుకునేవారు. అయితే ఈసారి లోక్‌సభలో ఎన్డీయేకు 293 సీట్లు రాగా, ఇండియా కూటమికి 233 సీట్లు వచ్చాయి. దీంతో స్పీకర్ పదవికి పోటీ అనివార్యమైంది. మరి బీజేపీ పెద్దల మనసులో ఏమందో చూడాలి.

Tags

Related News

India Warning: పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇండియా.. ఈసారి వారి మంచి కోసమే, వాళ్లంతా సేఫ్!

CISF Women Commando: పురుషుల ఆధిపత్యానికి ఫుల్‌స్టాప్…. మహిళా కమాండోలు ఎంట్రీ!

Metro Fare Hikes: ప్రయాణికులకు షాక్.. సడన్‌గా చార్జీలు పెంచిన మెట్రో

Rahul Mamkootathil: సినీ నటి ఆరోపణలు.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాహుల్ సస్పెండ్

Heavy Rains: దేశాన్ని వణికిస్తున్న వాన బీభత్సం.. విద్యాసంస్థలకు సెలవులు

Delhi News: ఢిల్లీ సీఎం రేఖాపై దాడి కేసు.. తీగలాగితే డొంక కదులుతోంది, కొత్త విషయాలు బయటకు

Big Stories

×