E-Paper
Advertisement

జ్యువెలరీ షాపులో దొంగతనం… కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ

జ్యువెలరీ షాపులో దొంగతనం… కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ
Advertisement

Malayalam Investigation Thriller: ఎక్కడైనా దొంగతనం జరిగితే ఏమవుతుంది ? వెంటనే పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. దొరికిన క్లూస్ తో దొంగలను పట్టుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం దొంగలే పోలీసులకు చెమటలు పట్టిస్తారు. ఓ డేంజరస్ ఊళ్ళో దాక్కుని వాళ్ళు చేసే అరాచకం కళ్ళార్పకుండా చూడాల్సిందే మావా. ఇలాంటి సీన్లున్న మంచి మలయాళం మూవీ ‘కుట్టవుం శిక్షయుమ్’ (Kuttavum Shikshayum). 2022లో విడుదలైన ఈ మలయాళ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడొచ్చు ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సినిమా కథ 2015లో కేరళలో జరిగిన రియల్ నగల దోపిడీ కేసు ఆధారంగా రూపొందింది. ఈ చిత్రానికి కథ అందించిన సిబి థామస్ స్వయంగా ఒక నిజజీవిత పోలీస్ ఆఫీసర్ కావడం విశేషం. ఇక కథలోకి వెళ్తే… కేరళలోని కాసరగోడ్ జిల్లాలో స్టోరీ మొదలవుతుంది. ఒక పెద్ద నగల దుకాణంలో అర్ధరాత్రి వేళ భారీ దొంగతనం జరుగుతుంది. దొంగలు సుమారు 1.5 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్తారు. విషయం పోలీస్ స్టేషన్ కు చేరడంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ కేసును ఛేదించే బాధ్యత సిఐ సాజన్ ఫిలిప్ (ఆసిఫ్ అలీ)పై పడుతుంది.

Advertisement

సాజన్ తనతో పాటు అలెన్సియర్, సన్నీ వేన్, షరాఫుద్దీన్, సెంథిల్ కృష్ణలతో ఒక ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడే కేరళ నుంచి కథ నార్త్ కు షిఫ్ట్ అవుతుంది. ప్రాథమిక విచారణ, సిసిటివి విజువల్స్ ఆధారంగా, ఈ దొంగతనానికి పాల్పడింది ఎవరో కనిపెడతారు పోలీసులు. ఇదంతా చేస్తోంది ఉత్తర భారతదేశానికి చెందిన ఒక అంతర్రాష్ట్ర ముఠా అని గుర్తిస్తారు. నిందితులను పట్టుకోవడానికి ఈ ఐదుగురు కేరళ పోలీసులు ఉత్తరప్రదేశ్‌ – రాజస్థాన్ సరిహద్దులోని ఓ మారుమూల గ్రామానికి వెళ్తారు. నేరపూరిత నెట్‌వర్క్ ఉన్న గ్రామం అది.

ఆ గ్రామంలోకి అపరిచిత వ్యక్తులు ఎవరు వచ్చినా అక్కడి స్థానికులు బతికి బయట పడనివ్వరు. పైగా స్థానిక పోలీసుల నుండి కేరళ పోలీసులకు ఆశించిన స్థాయిలో సహకారం అందదు. భాషా సమస్యలు, ప్రతికూల వాతావరణం, ప్రాణాపాయం ఉన్నా సరే.. సాజన్ బృందం చాలా ఓపికతో, సాంకేతిక పరిజ్ఞానం, స్థానిక ఇన్ఫార్మర్ల సహాయంతో నిందితుల కదలికలను ట్రాక్ చేస్తారు. ఎలాంటి సినిమాటిక్ ఫైట్లు, గాల్లో లేచే కార్లు లేకుండా.. చాలా సహజంగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు పోలీసులు. ఆ నేరస్థుల గ్రామంలోకి అర్ధరాత్రి వేళ చొరబడి నిందితులను ఎలా అరెస్ట్ చేశారు ? ఆ తర్వాత స్థానిక గ్రామస్థుల దాడి నుండి ప్రాణాలతో ఎలా బయటపడ్డారు పోలీసులు ? దొంగిలించబడిన బంగారాన్ని కేరళకు ఎలా తిరిగి తీసుకు వచ్చారు ? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.

Advertisement

పోలీస్ ప్రొసీజర్ విధానంతో సినిమా ఆసక్తికరంగా ముగుస్తుంది. ఇందులో మిగతా కమర్షియల్ పోలీస్ సినిమాల్లా కాకుండా, ఒక దర్యాప్తులో పోలీసులు ఎదుర్కొనే నిజమైన కష్టాలు, మానసిక ఒత్తిడి, నిరీక్షణను డాక్యుమెంటరీ శైలిలో కళ్లకి కట్టినట్లు చూపించారు. ‘కుట్టవుం శిక్షయుమ్’ ప్రస్తుతం కేవలం మలయాళ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో Netflix ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ మాత్రం లేదు.

Read Also : ఈ ఆడదెయ్యానికి దేవుళ్లంతా బంధువులే… ప్యాంట్ తడిపించే సీన్లు మావా

Tags

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×