BigTV English

Madhya Pradesh: బోరుబావిలో పడిన చిన్నారి.. 9 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత?

Madhya Pradesh: బోరుబావిలో పడిన చిన్నారి.. 9 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత?
Madhya Pradesh news today

Madhya Pradesh news today(Current news from India):

మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. రాజ్‌గఢ్‌లోని పిప్లియా రసోడా గ్రామంలో ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి కనిపించక పోవడంతో కుటుంబసభ్యులు పరిసరాలన్నీ గాలించారు. చివరకు బాలిక బోరుబావిలో పడిందని గుర్తించారు.


తల్లిదండ్రుల ఫిర్యాదుతో NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగాయి. రాజ్ గఢ్ కలెక్టర్ హర్ష్ దీక్షిత్, రాజ్ గఢ్ ఎస్పీ ధరమ్ రాజ్ మీనా ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక సుమారు 30 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ, ఇతర పరికరాల సహాయంతో బోరుబావికి సమాంతరంగా తవ్వుతూ వెళ్లగా.. 22 అడుగుల వద్ద చిన్నారి ఏడుపును గుర్తించారు. పాప బ్రతికే ఉందని గ్రహించి.. వెంటనే ఆక్సిజన్ ను లోపలికి పంపారు. సుమారు 9 గంటల పాటు శ్రమించి.. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో బాలికను బయటకు తీశారు. వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×