BigTV English

Viral Video: సెక్రటేరియట్ మూడో అంతస్తు నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్.. ఎమ్మెల్యేలు, ఎందుకో తెలుసా?

Viral Video: సెక్రటేరియట్ మూడో అంతస్తు నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్.. ఎమ్మెల్యేలు, ఎందుకో తెలుసా?

Maharashtra Deputy Speaker Jumps Off  Secretariat: మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ఎన్సీపీ ఎమ్మెల్యే నరహరి జిర్వాల్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. గంధార్ తెగను ఎస్టీల్లో కలుపొద్దని డిమాండ్ చేస్తూ ఏకంగా ఆ రాష్ట్ర సచివాలయం మంత్రాలయ మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. ఆయనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా దూకేశారు. అయితే, వాళ్లంతా కింద కట్టిన సేఫ్టీ నెట్ లో పడటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

మహారాష్ట్ర ప్ఱభుత్వం ధంగార్ తెగకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంత వరకు ఓబీసీ కేటగిరీలో ఉన్న ధంగార్ తెగను ఎస్టీల్లో కలపాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు ఎస్టీ ప్రజా ప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నిరసనల్లో అజిత్ వర్గానికి చెందిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఆందోళనలకు దిగుతున్నారు. ధంగార్ తెగకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వకూడదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్లకు కొనసాగిస్తున్న ప్రత్యేక చట్టాన్ని అలాగే కంటిన్యూ చేయాలే తప్ప, ఎస్టీల్లో చేర్చకూడదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో ఎస్టీ వర్గానికి చెందిన నరహరి జిర్వాల్ సైతం పాల్గొంటున్నారు. నిరసనలో భాగంగానే ఆయన సచివాలయం నుంచి కిందకి దూకేస్తామని బెదిరించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు సేఫ్టీ నెట్ ఏర్పాటు చేశారు. డిప్యూటీ స్పీకర్ సహా ఇతర ఎమ్మెల్యేలను కిందికి రావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయినప్పటీ వాళ్లు వినకుండా కిందికి దూకేశారు. ముందు డిప్యూటీ స్పీకర్ కిందికి దూకగా, ఆయనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దూకేశారు. నెట్ లో పడటంతో ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


సీఎం సమక్షంలో ఇరు వర్గాల ఎమ్మెల్యేల ఆందోళన

అంతకు ముందు రోజు ధంగార్ తెగను ఎస్టీల్లో కలిపే అంశంపై ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సమయంలోనే సచివాలయం కాంప్లెక్స్ లో ధంగార్ తెగను ఎస్టీల్లో కలపాలని కొందరు, కలపొద్దని మరికొందరు ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. ఇప్పటి వరకు ధంగార్ తెగ ఓబీసీ కేటగిరీలో ఉందని, వారిని ఎస్టీ కేటరిరీలో చేర్చాలని ఆ తెగకు సంబంధించి ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తమ తెగను ఎస్టీల్లో చేర్చారని, మహారాష్ట్రలో కూడా తమ తెగలను ఎస్టీ జాబితాలోకి తీసుకురావాలంటున్నారు.  ధంగార్ తెగ ప్రజలు ఎక్కువగా ఉండే  షోలాపూర్ జిల్లాలోనూ ఆందోళనలు ఊపందుకున్నాయి. మొత్తంగా ధంగార్ తెగ విషయంలో రెండు రకాల ఆందోళనల పట్ల మహా సర్కారు ఏం చేయాలో తెలియక సతమతం అవుతోంది.

Read Also:మావోలకు షాక్, చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్.. 36 మంది మృతి, తప్పించుకున్న అగ్రనేతలు?

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×