E-Paper
Advertisement

సుప్రీంలో చుక్కెదురు.. దానం నాగేందర్ ఆసక్తికర రియాక్షన్.. ‘ఇది ముందే తెలుసంటూ..!’

సుప్రీంలో చుక్కెదురు.. దానం నాగేందర్ ఆసక్తికర రియాక్షన్.. ‘ఇది ముందే తెలుసంటూ..!’
Advertisement

Danam Nagender: సుప్రీంకోర్టులో దానం నాగేందర్ కు బిగ్ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఆయన అనర్హత వేటు పిటిషన్ పై విచారణ జరిపేందుకు ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది. పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఒక పార్టీ నుంచి గెలిచి.. మరో పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయడాన్ని తప్పుబట్టింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై దానం నాగేందర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సుప్రీంకోర్టు తీర్పును తాను స్వాగిస్తున్నట్లు దానం నాగేందర్ తెలిపారు. సికింద్రాబాద్ బాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే ఇది ఊహించానని అన్నారు. తాను అనుకున్నదే జరిగిందని వ్యాఖ్యానించారు. అలాగని లీగల్ గా ఫైట్ చేయడంలో తప్పు లేదు కదా అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే తాను సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు స్పష్టం చేశారు. అయితే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

తాను మళ్లీ ప్రజల్లోకి వచ్చి ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తానని దానం నాగేందర్ ధ్రువీకరించారు. నియోజకవర్గానికి పరిమితమై పనిచేస్తానని అన్నారు. ‘నేను ఎవరిని కలవలేదు. కోర్టు తీర్పు కోసం వెయిట్ చేశాను. ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చాక ఏ పార్టీ నుండి పోటీ చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటాను’ అని అన్నారు. అయితే ప్రజల మధ్యనే ఉన్నాను కాబట్టి తన గెలుపు తథ్యమని దానం ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులు తనకు తప్పక ఉంటాయని పేర్కొన్నారు. ప్రజల మధ్యే ఉండే వారు ఏ పార్టీలో ఉన్నా గెలుస్తారని అభిప్రాయపడ్డారు.

Also Read: మెుబైల్ నెంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. సెప్టెంబర్ 25 డెడ్ లైన్.. ఈ ప్రచారంలో వాస్తవమెంత!

Advertisement

ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని స్కీం లు అమలు చేస్తోందని దానం నాగేందర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 24 గంటలు కష్టపడి పని చేస్తున్నారని ప్రశంసించారు. డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. మరోవైపు తనకు ప్రజా బలం ఉందన్న నాగేందర్.. ఖైరతాబాద్ ప్రజలు తనను కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నట్లు చెప్పారు. ఖైరతాబాద్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు. తమ నియోజకవర్గంలో 10వేల ఇండ్లు కట్టడానికి సరిపడ స్థలం ఉందన్నారు. మెుత్తంగా దానం పిటిషన్ ను సుప్రీం సైతం డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఖైరతాబాద్ శాసనసభ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైందని చెప్పవచ్చు.

Also Read: బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. సెప్టెంబర్ 25వ తేదీనే జీతాలు.. కేంద్రం కీలక ఆదేశాలు!

Tags

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

Big Stories

Advertisement
×