E-Paper
Advertisement

నలుగురు మహిళల డార్క్ సీక్రెట్స్… బోల్డ్ తెలుగు ఆంథాలజీ థ్రిల్లర్ ఇప్పుడు 2 ఓటీటీల్లో

నలుగురు మహిళల డార్క్ సీక్రెట్స్… బోల్డ్ తెలుగు ఆంథాలజీ థ్రిల్లర్ ఇప్పుడు 2 ఓటీటీల్లో
Advertisement

Telugu Psychological Thriller on OTT : ప్రతి మనిషి జీవితంలో బయట ప్రపంచానికి కనిపించే ముఖం ఒకటైతే.. ఎవరికీ తెలియకుండా దాచుకునే రహస్య జీవితం మరోటి ఉంటుంది. ఆ చీకటి కోణాలు ఒక్కసారిగా వెలుగులోకి వస్తే కుటుంబాలు, బంధాలు, జీవితాలు ఎలా తలకిందులవుతాయో చూపించే సైకలాజికల్ థ్రిల్లర్ యాంథాలజీనే ‘డార్క్ సీక్రెట్స్’ (Dark Secrets). బోల్డ్ ఎమోషన్స్, మిస్టరీ, మైండ్ గేమ్స్, ఊహించని ట్విస్టులతో రూపొందిన ఈ తెలుగు సిరీస్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మరి పెద్దలు మాత్రమే చూడాల్సిన ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ కథ నలుగురు సాధారణ మహిళల జీవితాలు ప్రధానంగా సాగుతుంది. బయటకు చూస్తే మామూలుగా అందరిలాగే కనిపిస్తారు. కానీ ప్రతి ఒక్కరి మనసులో కుటుంబానికి కూడా తెలియని కొన్ని రహస్యాలు, నెరవేరని కోరికలు, ఒంటరితనం దాగి ఉంటాయి. సమాజం విధించిన ఆంక్షలు, ప్రేమలో ఎదురైన నిరాశ, కుటుంబంలో దక్కని ఆదరణ కారణంగా వారు క్రమంగా తమ జీవితాల్లో కొన్ని ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటారు.

Advertisement

మొదట్లో ఎవరూ గుర్తించని ఆ రహస్యాలు ఒకానొక దశలో ఒక్కొక్కటిగా బయటపడే పరిస్థితి వస్తుంది. దీంతో వారి వ్యక్తిగత జీవితాల్లో భారీ అలజడి మొదలవుతుంది. కుటుంబ సభ్యుల అనుమానాలు, బ్లాక్‌మెయిలింగ్, మానసిక ఒత్తిడి, సంబంధాల్లో ఏర్పడే విభేదాలు వారిని టెన్షన్ లోకి నెడతాయి.

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు వారి బలహీనతలను ఉపయోగించుకుంటూ ప్రమాదకరమైన మైండ్ గేమ్స్ ఆడటం ప్రారంభిస్తారు. చివరకు ఆ నలుగురు మహిళలు ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డారు? తమ సీక్రెట్స్ వల్ల వచ్చిపడ్డ సమస్యలు ఏంటి ? వారి జీవితాలకు ఎలాంటి ముగింపు దక్కింది ? అనేదే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రధాన కథ.

Advertisement

Also Read : ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఓటీటీలో… 30 ఏళ్లు పోలీసులకు దొరకని మాస్టర్‌మైండ్ కథ

తెలుగులోనే స్ట్రీమింగ్

‘డార్క్ సీక్రెట్స్’ యాంథాలజీ సిరీస్. ప్రతి ఎపిసోడ్ ముగిసే సరికి కొత్త ట్విస్ట్ రావడం ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ. బోల్డ్ కంటెంట్, సస్పెన్స్, సైకలాజికల్ డ్రామాలు ఇష్టపడే వారికి ఇది మంచి ఛాయిస్. ఈ సిరీస్ ప్రస్తుతం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), హంగామా (Hungama) ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ 2026 ఆగస్టు 5 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఇందులో బోల్డ్ కంటెంట్, ఇంటెన్స్ థీమ్స్ ఉండటంతో అడల్ట్ రేటింగ్ ఉంది. కాబట్టి సింగిల్ గా చూడదమే బెటర్ అని గుర్తు పెట్టుకోండి. పొరపాటున కూడా పిల్లలు, ఫ్యామిలీ పక్కనే ఉన్నప్పుడు ఈ సిరీస్ జోలికి వెళ్ళకండి. సస్పెన్స్‌తో పాటు ఊహించని ట్విస్టులతో సాగే కథ కావాలనుకుంటే ఒకసారి తప్పకుండా చూడాల్సిన సిరీస్ ఇది.

Also Read : బెడ్‌రూమ్‌లో కూర్చునే 200 కోట్ల చోరీ.. ఒక్క హ్యాక్‌తో ప్రాణాల మీదికి… హై-వోల్టేజ్ సైబర్ థ్రిల్లర్

Related News

లేడీస్ హాస్టల్ లో అమ్మాయి మర్డర్… అమాయకుడు బలి… చివరి 20 నిమిషాల్లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్

ఎడారి మధ్యలో శవం… 99 నిమిషాల థ్రిల్లర్… చివరి వరకు సస్పెన్స్ గ్యారెంటీ

‘లెనిన్’ నుంచి ‘హృదయం మురళి’ వరకు… ఈ శుక్రవారం మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఇవే

ఒక్క ఫేక్ వీడియోతో కూలిపోయిన కుటుంబం.. షాక్ ఇచ్చే గ్రిప్పింగ్ సైబర్ ఓటీటీ సిరీస్

గతంలో జరిగిన నేరం… వర్తమానంలో వెంటాడిన శాపం… మస్ట్ వాచ్ హారర్

నిషేధిత మాయా విద్యతో ప్రేమ, ప్రతీకారం… ఫాంటసీ లవర్స్ అస్సలు మిస్ కాకూడని కొరియన్ సిరీస్

ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఓటీటీలో… 30 ఏళ్లు పోలీసులకు దొరకని మాస్టర్‌మైండ్ కథ

Big Stories

Advertisement
×