E-Paper
Advertisement

టీవీ కోసం గొడవ.. కూతుర్ని బ్యాటుతో కొట్టి చంపిన తండ్రి.. విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు!

టీవీ కోసం గొడవ.. కూతుర్ని బ్యాటుతో కొట్టి చంపిన తండ్రి.. విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు!
Advertisement

Father Kill Daughter: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసింది. టీవీ విషయంలో ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవ.. పదహారేళ్ల బాలిక ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. స్వయంగా తండ్రే కన్నకూతురిని క్రికెట్ బ్యాట్‌తో తలపై కొట్టి దారుణంగా హత్య చేసే స్థాయికి దిగజారింది.

వివరాల్లోకి వెళ్తే..

మృతురాలిని ఆర్యా కడమ్‌గా పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి ఇంట్లో టీవీ చూసే విషయమై ఆర్యకు ఆమె తమ్ముడు, చెల్లితో గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపంతో రగిలిపోయిన ఆర్య, తన చెల్లి కంటిపై పిడికిలితో గుద్దింది. గొడవను గమనించిన తండ్రి పురుషోత్తమ్.. ఆమెను గట్టిగా మందలించాడు. దీంతో మరింత ఆవేశానికి లోనైన ఆర్య.. బూతులు తిడుతూ బ్యాట్‌తో తండ్రి మీదికి దూసుకొచ్చింది. కూతురి ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి గురైన పురుషోత్తమ్.. ఆమె చేతిలోని బ్యాట్‌ను లాక్కుని సరాసరి తలపై బలంగా బాదాడు. తీవ్ర గాయమవడంతో ఆర్య ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది.

సాక్ష్యాల చెరిపివేతకు యత్నం

Advertisement

హత్య జరిగిన తర్వాత పురుషోత్తమ్ దాదాపు రాత్రంతా మృతదేహం పక్కనే కూర్చుండిపోయాడు. ఆదివారం వేకువజామున ఈ విషయాన్ని తన భార్యకు తెలియజేశాడు. అనంతరం నేరాన్ని కప్పిపుచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఇంట్లోని నేలపై ఉన్న రక్తపు మరకలను కడిగేశారు. ఆర్య వేసుకున్న టీ-షర్టుపై ఉన్న రక్తాన్ని వదిలించేందుకు వాషింగ్ మెషిన్‌లో మూడుసార్లు ఉతికారు. హత్యకు ఉపయోగించిన క్రికెట్ బ్యాట్‌ను ఎవరికి కనిపించకుండా ఇంటి కప్పుపైకి విసిరేశారు.

పోలీసుల విచారణతో వెలుగులోకి..

ఆదివారం ఉదయం బంధువులు, పొరుగువారి ద్వారా సమాచారం అందుకున్న సతారా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొదట్లో బాలిక తలపై తనే కొట్టుకుని చనిపోయిందని కుటుంబ సభ్యులు పోలీసులను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించగా తల్లి నిజం చెప్పేసింది. దాంతో తండ్రి పురుషోత్తమ్ కూడా నేరాన్ని అంగీకరించాడు. అనంతరం ఇంటి పైకప్పుపై దాచిన బ్యాట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నా కూతురు దారి తప్పింది: తండ్రి

Advertisement

అయితే పురుషోత్తమ్, అతని భార్య షీలా ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. దాడి ఘటనపై పురోషోత్తమ్ స్పందిస్తూ.. ‘నా కూతురు దారి తప్పింది. చెడు వ్యసనాలకు బానిసలైంది. ఆమె చేష్టలతో విసిగిపోయి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు’ అని పురుషోత్తమ్ విచారణలో పేర్కొన్నాడు. అయితే పొరుగువారు మాత్రం ఆర్య అందరితో చాలా ప్రేమగా, కలుపుగోలుగా మాట్లాడేదని చెబుతున్నారు.

Also Read: ఆప్ నేతకు మహిళ బిగ్ షాక్.. ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి పెళ్లి.. ఆపై ఇంట్లోని బంగారంతో జంప్!

తండ్రి చేయి విరగ్గొట్టిన కూతురు

ఇదిలా ఉంటే పోలీసుల ప్రాథమిక విచారణలో ఆర్య మానసిక స్థితి సరిగ్గా లేదని తేలింది. పూణేలోని ఒక సైకియాట్రిస్ట్ వద్ద ఆమె చికిత్స పొందుతోందని, ప్రతిరోజూ మందులు వాడుతోందని వెల్లడైంది. మొబైల్, టీవీలను అతిగా వాడటంతో పాటు చిన్న విషయాలకే తీవ్రంగా ప్రకోపానికి గురయ్యేదని తెలిసింది. గత మే నెలలో కూడా ఆర్య తండ్రిపై దాడి చేయగా ఆయన చెయ్యి విరిగినట్లు పోలీసులు తెలిపారు. అతిగా ఫోన్ వాడటం వల్ల చిరాకు, ఆందోళనకు గురై గతంలో ఒకసారి ఆసుపత్రిలో కూడా చేరినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనపై సతారా నగర పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: శంషాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎం బద్దలుకొట్టి రూ.32 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు!

Tags

Related News

స్కూళ్లలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరి చేయలేం.. సుప్రీంకోర్టు సంచలనం!

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు.. ముగ్గురి చేత సీజేఐ ప్రమాణ స్వీకారం.. 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య!

ఆప్ నేతకు మహిళ బిగ్ షాక్.. ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి పెళ్లి.. ఆపై ఇంట్లోని బంగారంతో జంప్!

పబ్‌జీ గేమ్ టాస్క్.. ఇల్లు వదిలి పారిపోయిన 14 ఏళ్ల బాలుడు.. పోలీసులు ఏం చేశారంటే?

సరిగా చదవలేదని అమానుష ఘటన.. 82 మంది విద్యార్థులకు అరగుండు, మహారాష్ట్రలో దారుణం

భారతీయుల కిడ్నాప్.. డబ్బులు డిమాండ్ చేయకుండా, ఫ్లైట్ టికెట్లు తీసి మరి వదిలిపెట్టిన వైనం.. ఎందుకంటే?

10 సీఎన్‌జీ బస్సులు దగ్ధం.. షార్ట్ సర్క్యూట్ కారణమా? ముంబైలో ఘటన

Big Stories

Advertisement
×