Honor X5ds: ఒకప్పుడు కేవలం కాస్ట్లీ ఫోన్లలో మాత్రమే కనిపించే డ్యూయల్ స్క్రీన్ టెక్నాలజీని ఇప్పుడు బడ్జెట్ రేంజ్ లోకి తీసుకొచ్చింది ప్రముఖ హానర్ సంస్థ. తాజాగా సౌత్ ఆఫ్రికాలో హానర్ Honor X5ds అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వెనుక వైపు ఒక చిన్న స్క్రీన్ ఇవ్వడం ఈ ఫోన్ ప్రత్యేకత. మరి రూ.14,500 ధర ఉన్న ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఒకసారి వివరంగా చూద్దాం.
ఈ ఫోన్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని డిస్‌ప్లేల గురించే. ముందు వైపు 6.78 అంగుళాల పెద్ద ఎల్సీడీ స్క్రీన్ ఇచ్చారు. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇక వెనుక వైపు 2.01 అంగుళాల చిన్న స్క్రీన్ ఉంటుంది. దీంట్లో నోటిఫికేషన్లు చూడటం, పాటలు మార్చడం చేయవచ్చు. అంతేకాకుండా మెయిన్ కెమెరాతో సెల్ఫీలు తీసుకునేటప్పుడు దీనిని రియర్ వ్యూగా వాడుకోవచ్చు.
Also Read: వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!
కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు. ఇది 4ఎక్స్ డిజిటల్ జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది. ముందు వైపు వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక ఈ ఫోన్‌లో మరో పెద్ద ప్లస్ పాయింట్ దీని 6000mah బ్యాటరీ. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడుకోవచ్చు. దీని కోసం బాక్స్‌లో 15 వాట్స్ ఛార్జర్ ఇస్తున్నారు.
ఈ స్మార్ట్‌ఫోన్ యునిసోక్ టి610 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. రోజువారీ వాడకానికి, సోషల్ మీడియా యాప్స్ ఉపయోగించడానికి ఇది సరిపోతుంది. ఆండ్రాయిడ్ 16 గో ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచుకోవచ్చు. డస్ట్, వాటర్ స్ప్లాష్ నిరోధకత కోసం ఐపీ52 రేటింగ్ కూడా ఇచ్చారు.
ప్రస్తుతానికి ఈ ఫోన్ సింగిల్ వేరియంట్‌లో లభిస్తోంది. ఫారెస్ట్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి తెచ్చారు. సౌత్ ఆఫ్రికాలో దీని ధర 2,499 ర్యాండ్‌లుగా ఉంది. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.14,500 వరకు ఉంటుంది. బడ్జెట్ రేంజ్‌లో డ్యూయల్ స్క్రీన్, పెద్ద బ్యాటరీ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
Also Read: డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!