E-Paper
Advertisement

శంషాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎం బద్దలుకొట్టి రూ.32 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు!

శంషాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎం బద్దలుకొట్టి రూ.32 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు!
Advertisement

ATM Robbery: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని శాతంబరాయి వద్ద ఘరానా దొంగతనం వెలుగుచూసింది. స్థానిక యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. సుమారు రూ. 32 లక్షల నగదుతో పరారయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరగ్గా.. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీకి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. దొంగలు చాకచక్యంగా ఏటీఎం సెంటర్‌లోకి ప్రవేశించి.. వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ల సహాయంతో మిషన్‌ను కట్ చేశారు. నగదు ఉండే ప్రధాన భాగాన్ని తెరిచి అందులోని దాదాపు రూ. 32 లక్షల క్యాష్‌ను తీసుకొని అక్కడి నుంచి చకచకా జారుకున్నారు.

Advertisement

వెలుగులోకి వచ్చిందిలా..

మంగళవారం ఉదయం డబ్బులు తీసేందుకు వచ్చిన కస్టమర్లు ఏటీఎం మిషన్ ధ్వంసమై ఉండటాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని బ్యాంక్ అధికారులకు తెలియజేశారు. వారు ఇచ్చిన సమాచారంతో శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

రంగంలోకి క్లూస్ టీమ్

Advertisement

పోలీసులతో పాటు ఘటనా స్థలాన్ని ‘క్లూస్ టీమ్’ (CLUES) కూడా సందర్శించింది. దొంగలు వదిలివెళ్లిన ఆనవాళ్లు, వేలిముద్రలు, ఇతర ఫోరెన్సిక్ ఆధారాలను క్లూస్ టీమ్ సేకరించింది. ఈ ఆధారాల ఆధారంగా నేరం జరిగిన తీరును, దుండగుల ముఠాను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Also Read: పబ్‌జీ గేమ్ టాస్క్.. ఇల్లు వదిలి పారిపోయిన 14 ఏళ్ల బాలుడు.. పోలీసులు ఏం చేశారంటే?

సీసీటీవీ దృశ్యాల పరిశీలన

దర్యాప్తులో భాగంగా ఏటీఎం సెంటర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగులు ఏ వైపు నుంచి వచ్చారు? చోరీ అనంతరం ఏ మార్గంలో పారిపోయారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. అయితే నిందితులు చోరీ ముందే ఏటీఎం వద్ద రెక్కీ నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీకి ముందు సరిగ్గా ఏటీఎంలో ఎంత డబ్బు ఉందన్న దానిపై బ్యాంక్ అధికారులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Also Read: టెలికాం రంగంలో సంచలనం.. 126 కోట్లకు చేరిన మొబైల్ యూజర్లు.. ట్రాయ్ రిపోర్టులో షాకింగ్ లెక్కలు!

Tags

Related News

తెలంగాణ బీజేపీ త్రిముఖ వ్యూహం.. 3 జోన్లు.. 3 విభిన్న ప్లాన్లు!

దాండియా ఈవెంట్లపై వివాదం.. ఓవైసీకి గట్టి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే రాజా సింగ్!

అక్టోబర్‌లోగా కరువు నివేదిక సిద్ధం చేయండి.. అధికారులకు సీఎస్ ఆదేశం!

కల్వకుంట్ల శకం ముగిసింది.. 14 ఏళ్ల వనవాసం తప్పదు! BRS నేతలపై సాయికుమార్ ఫైర్

బీజేపీలో మహిళలకు రక్షణ లేదా.. మాజీ బీజేవైఎం జాతీయ కోశాధికారిపై కేసు నమోదు!

రేవంత్, కేసీఆర్ ఆస్తుల వివాదం.. హైకోర్టులో ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు!

లక్ష రూపాయల లంచం.. ACB వలలో DMHO స్వర్ణకుమారి!

Big Stories

Advertisement
×