మహారాష్ట్ర, జార్ఖండ్ సహా మరో మూడు రాష్ట్రాల్లోని పదిహేను అసెంబ్లీ స్థానాలకు పోలీంగ్ ప్రక్రియ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. మహారాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 4,136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహారాష్ట్రలో అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం 59 మంది అభ్యర్థులను బరిలో దింపింది. మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్ 101 మందిని బరిలో నిలిపింది.
బీజేపీ నుండి 149 మంది బరిలో ఉన్నారు. శివసేన యూబీటీ నుండి 95 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. శరద్ పవార్ ఎన్సీపీ నుండి 86 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మరోవైపు ఎంఐఎం కూడా ఈ ఎన్నికల్లో 17 మంది అభ్యర్థులను పోటీలో దింపింది. ఈ నెల 23న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. సీట్ల సర్దుబాటులో కొన్ని స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఆ స్థానాల్లో కూటమి పార్టీలు స్నేహపూర్వక పోటీలో దిగుతున్నాయి. ఇక ఝార్ఖండ్ లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని 9 అసెంబ్లీ స్థానాలకు సైతం నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.