Gundeninda GudiGantalu Today episode November 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి ఇంట్లో నుంచి మీనా రావడంతో బాలు కూడా వచ్చేయ్యాలని అనుకుంటాడు. కానీ అత్తగారు రింగ్ పెట్టినట్లు బాలు ఇంటికి వచ్చి మీనాతో గొడవ పడుతాడు. ఇక మీనాతో గొడవలు పడతాడు. అది బామ్మ చూస్తుంది. అమ్మమ్మ వచ్చింది అన్నా బాలు పట్టించుకోడు. వాళ్ళ నాన్నమ్మ గొడవ పడుతున్నావా అని అడుగుతుంది. తాగి వచ్చి నానా హంగామా చేశారు.దీంతో మా ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు. అందుకే చెప్పకుండా ఇంటికి వచ్చాను అంటుంది మీనా. అలాగే మీ విషయాలు కూడా ఇంట్లో చెప్పానని బాలుని ఆటపట్టిస్తుంది. దీంతో బాలు కంగారు పడతాడు. ఇంతలోనే షీలా డార్లింగ్ ఎంట్రీ ఇస్తుంది. తన కొడుకు సత్యం చూసి ఏంట్రా అలా ఉన్నావ్ అంటూ ఆరా తీసుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇక ఈరోజు ఇంట్లో షీలా హడావిడి చేస్తుంది. కింద బాలు విషయంలో తోచినట్లు మాట్లాడుతుంది. ఇక బాలు కవర్ చేసుకోలేక ఫీలవుతూ ఉంటాడు. ఇక మీనా దగ్గర కూర్చొని నిజాన్ని తెలుసుకుంటుంది. నాకు ఈ ఇంట్లో అందరి కన్నా ముందు పరిచయం అయ్యింది. నన్ను మనిషిలా గుర్తించింది మీరే అమ్మమ్మ అని మీనా ఎమోషనల్ అవుతుంది. ఇక బాలు సరిగా ఉంటున్నాడా లేదా అంటూ సంసారం గురించి అడుగుతుంది. బాలు చూడటానికి కోపంగా ఉన్నా.. తనతో బాగానే ఉంటాడు. కావాలంటే మీరే చూడండి. అంటూ తన బాధను మనసులో దాచుకుని అబద్దం చెబుతోంది మీనా. ఆ తరువాత సత్యం ఇంట్లో పండుగ సంబురాలు ప్రారంభమవుతాయి. బామ్మ వేసే కౌంటర్స్ కు ఇంట్లో కవర్ చేసుకోలేక ఒక్కొక్కరు ఇబ్బంది పడతారు.
నూనెతో తలంటుకొని స్నానం చేస్తే కుళ్ళు మొత్తం పోతుంది అంటూ ఇన్ డైరెక్ట్ గా ప్రభావతిపై పంచి వేస్తుంది షీలా డార్లింగ్. వెంటనే బాలు రియాక్ట్ అవుతు మనోజ్ గాడికి పెట్టు శీలా డార్లింగ్.. వాడి కుళ్ళు మొత్తం పోవాలి అంటాడు. దీంతో పక్కనే ఉన్న సత్యం పండగ కూడా గొడవలేంట్రా చిన్న పిల్లలా అని మందలిస్తాడు. చిన్నపిల్లలు అంటే గుర్తొచ్చింది చిన్నోడు ఎక్కడ ఉన్నాడ్రా.. వాడు కనిపించట్లేదు అంటూ బామ్మ అడుగుతుంది. దానికీ బాలు ఇప్పుడు వాడి గొడవ ఎందుకు అని అడుగుతాడు. ఇక మీనా ఏదోకటి చెప్పి కవర్ చేస్తుంది. అబద్దాల మీద అబద్దాలు చెప్తుంది. సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి ఊరెళ్ళాడు అంటూ కవరింగ్ చేస్తోంది. పండుగ పూట ఎవరైనా పనులు పెట్టుకుంటారా అంటూ రవికి ఫోన్ చేయబోతోంది.
బాలు ఆ ఫోన్ ని లాక్కొని మిమ్మల్ని అర్థనగ్నంగా నిలుచొబెట్టి పెట్టి.. రవి గాడికి ఫోన్ చేస్తావా అంటూ.. ఫోన్ లాక్కుటాడు బాలు. ఆ తర్వాత బాలుకి నూనె పెట్టమని మీనాకు తలకు నూనె పెట్టమని చెబుతుంది సుశీలమ్మ. కానీ నాకు ఎవరు నూనే పెట్టనవసరం లేదంటూ.. పక్కనే ఉన్న నూనె క్లాసు బదులు టీ క్లాస్ మీద పోసుకుంటాడు బాలు. దాంతో అందరు నవ్వుతారు. ఇక ఏం జరిగిందని అనుకొనేలోపు అందరు బాలుతో పరచకాలు ఆడుతారు. మీనా శారీ కట్టుకోవడానికి రూమ్ లోకి వెళుతుంది. ఆ విషయం తెలియకుండా బాలు సడన్ గా రూమ్ లోకి వస్తాడు. శారీ కట్టుకోవడం చూసి.. ఇలాంటి పనులు చేసేటప్పుడు కనీసం డోర్ పెట్టుకోవాలి? కదా అంటూ కోపాడుతాడు బాలు. నేను డోర్ వేసుకునే చీర కట్టుకుంటున్నా.. కానీ, మీరే వచ్చారంటుంది మీనా. నీతో మాట్లాడటం వేస్ట్ అంటూ.. బయటికి వెళ్తుంటాడు బాలు.
ఇక తన చీర కుచ్చులు సెట్ కావడం లేదు కాస్త సెట్ చేయండి అంటుంది మీనా. అలాంటి పనులు నాతో కావు అంటూ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు బాలు. ఇక మీనా అమ్మమ్మ అనగానే బాలు కింద కూర్చొని కుచ్చుళ్ళు సరి చేస్తాడు.. ఇక ప్రభావతి పూజ చేసి హరతి తీసుకొని వస్తుంది. ఈ సమయంలో బాలు మీనాలు ఇద్దరు కలిసి సుశీల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. సంవత్సరం తిరిగేలోపు తనకు పండంటి బిడ్డను ఇవ్వాలంటూ ఆశీర్వాదం ఇస్తోంది. ఈ సమయంలో రవి కూడా ఉంటే బాగుండేది అంటూ బాధపడుతోంది సుశీల. ఆ తర్వాత రవికి ఫోన్ చేస్తుంది. ఏంట్రా నువ్వు చేసిన పని.. నీకు పద్ధతి పాడు లేకుండా చేసావు అని అడుగుతుంది. ప్రభావతి నాకు అంతా నిజం చెప్పేసింది. అసలు విషయం తెలియకుండా సాయంత్రం ఇంట్లో దీపం పెట్టే సమయం వరకు ఇంటికి రమ్మని ఆర్డర్ వేస్తుంది సుశీలమ్మ.. ఇంట్లో వాళ్లు తనని పండుగకు పిలిచారని రవి సంతోషిస్తాడు. వెంటనే శృతికి ఫోన్ చేసి.. నీకు ఓ సంతోషకరమైన వార్త చెప్పాలంటూ.. త్వరగా ఇంటికి రమ్మని చెబుతాడు. ఇక మరోవైపు బాలు కారు కోసం సేటు దగ్గరకు వెళ్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో రవి గురించి సుశీలకు నిజం తెలిసిపోతుందేమో చూడాలి..