BigTV English

Best Portable Air Conditioners : బుల్లి బుల్లీ ఏసీలు.. మీ ఇంటిని జిల్ జిల్ చేస్తాయి!

Best Portable Air Conditioners : బుల్లి బుల్లీ ఏసీలు.. మీ ఇంటిని జిల్ జిల్ చేస్తాయి!
Best Portable Air Conditioners
Best Portable Air Conditioners

Best Portable Air Conditioners : వేసవి మొదలై ఎండలు మండుతున్నాయి. బయటకి వెళ్తే నెత్తి మలమల మాడిపోతుంది. ఈ నేపథ్యంలో ఎండల నుంచి సేద తీరేందుకు జనాలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చల్లగా ఉండేందుకు ఏసీలను, కూలర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే కొంత కాలంలో మార్కెట్‌లో పోర్టబుల్ ఎయిర్ కండిషనర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి తక్కువ ధరతో లభించడంతో పాటు ఎక్కువ కూలింగ్‌ను కూడా అందిస్తాయి.


అంతే కాకుండా ఇవి తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఎక్కడైనా అమర్చుకునే వెసులుబాటు ఉంటుంది. కరెంటు ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ నీటితో ఎక్కువ సేపు కూలింగ్‌ను అందిస్తాయి. తక్కువ ధరలో బెస్ట్ క్వాలిటీతో లభించే నాలుగు పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ల గురించి ఇప్పుడు తెలుసుకోండి.

Also Read : సవక సవక.. ఈ రియల్ మీ 5జీ స్మార్ట్‌ఫోన్ చాలా సవక!


HOOMEE 560 CM పోర్టబుల్ ఎయిర్ కండీషనర్

HOOMEE 560 CM యూనివర్సల్ విండో సీల్ అనేది లేటెస్ట్ పోర్టబుల్ ఎయిర్ కండిషనర్. దీనిని విండోకు కూడా అమర్చుకోవచ్చు. దీనికి ఉన్న ఎయిర్ ఎక్స్ఛేంజ్ గార్డులు వేడి గాలిని గదిలోకి ప్రవేశించకుండా చేస్తాయి. అలానే గదిని తక్కువ సమయంలోనే కూల్‌‌గా మారుస్తుంది. ఇది 560 సెంమీ పొడవుతో ఉంటుంది. ఇది విండోకు సులభంగా అతికించవచ్చు. దీని ధర రూ. 5593గా అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

రివేరా పర్సనల్ ఎయిర్ కూలర్

రివేరా పర్సనల్ ఎయిర్ కూలర్ అనేది తక్కువ స్థలాన్ని ఆక్రమించే పోర్టబుల్ ఎయిర్ కండీషనర్. ఇది
తక్కువ స్థలాన్ని ఆక్రమించడంతో పాటు చక్కటి చల్లదనాన్ని అందిస్తుంది. ఇందులో మినీ ఎవపొరాటివ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. దీనిని డెస్క్‌లు, నైట్‌స్టాండ్‌లు, కాఫీ టేబుల్‌ మీద పెట్టొచ్చు. 7 రంగుల LED లైట్‌ను కలిగి ఉంటుంది. కూలింగ్ అడ్జెస్ట్‌మెంట్ కూడా ఉంది. దీని ధర 1809 రూపాయలుగా అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

ఎవాపోలార్ ఎవాచిల్ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్

ఎవాపోలార్ ఎవాచిల్ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ చక్కటి చల్లదనాన్ని అందిస్తోంది. దీనిని EV-500 అని కూడా పిలుస్తారు. దీన్ని కార్లు, క్యాంపింగ్, బెడ్‌రూమ్, ఆఫీస్‌లో ఉపయోగించుకోవచ్చు. ఈ ఎయిర్ కండీషనర్ డిజైన్, అర్బన్ గ్రే కలర్‌లో ఆకర్షణీయంగా ఉంటుంది. దీని ధర రూ. 15,897గా ఉంది. అమెజాన్ నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Also Read : వదలొద్దు మచ్చా.. రూ.45 వేల నథింగ్ ఫోన్‌పై రూ.33 వేల డిస్కౌంట్!

బజాజ్ స్నోవెంట్ టవర్ ఫ్యాన్

బజాజ్ స్నోవెంట్ టవర్ ఫ్యాన్ మీ ఇంటిని సులభంగా చల్లబరుస్తుంది. ఈ పోర్టబుల్ టవర్ AC మూడు స్పీడ్ ఎయిర్ కంట్రోలర్స్‌తో లభిస్తోంది. ఇందులో హై ఎయిర్ త్రో, స్వింగ్ కంట్రోల్ ఫీచర్‌ ఉంటుంది. ఇది గదికి చక్కటి కూలింగ్‌ను ఇస్తుంది. దీన్ని కూల్ గ్రే కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.4,288గా ఉంది.

Tags

Related News

ATM PIN Safety: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!

Xiaomi 17 Pro: 5x జూమ్, 6,300mAh బ్యాటరీ.. అదిరిపోయే ఫీచర్లతో షావోమీ 17 ప్రో లాంచ్

Amazon Xiaomi 14 CIVI: షావోమీ 14 సివీపై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.17000 డిస్కౌంట్!

Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Big Stories

×