BigTV English

Man Fined: కారు నడుపుతూ హెల్మెంట్ పెట్టుకోలేదని ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు.. అది కూడా ఎంతంటే..?

Man Fined: కారు నడుపుతూ హెల్మెంట్ పెట్టుకోలేదని ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు.. అది కూడా ఎంతంటే..?

Man Fined for Driving Car without helmet: కారులో వెళ్తున్న ఓ వ్యక్తి హెల్మెంట్ ధరించలేదంటూ అతడికి పోలీసులు జరిమానా విధించారు. అది కూడా రూ. వెయ్యి చలాన్ వేశారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే..


యూపీకి చెందిన తుషార్ సక్సేనా అనే వ్యక్తి ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఏంటని ఓపెన్ చేసి చూడగా, అతనికి ముందుగా అర్థంకాలేదు. ఆ తరువాత ఓపికగా ఆ మెసేజ్ ను చదివాడు. తనకు రూ. వెయ్యి ఫైన్ విధించినట్లు అందులో పేర్కొనబడి ఉంది. హెల్మెంట్ ధరించనందుకు మీకు రూ. వెయ్యి జరిమానా విధిస్తున్నామంటూ అందులో పేర్కొన్నారు. దీంతో ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఆ తరువాత ఎవరికో పంపియ్యపోయి తనకు పంపించారనుకున్నాడు. కానీ, మరోసారి ఆయనకు మెసేజ్ వచ్చింది. అంతేకాదు. చలాన్ కట్టాలంటూ మెయిల్ కూడా వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సదరు వ్యక్తి.. సంబంధిత ట్రాఫిక్ పోలీసులను కలిశాడు.

Also Read: జమ్మూకశ్మీర్‌లో ఎలక్షన్స్..బీజేపీ అభ్యర్థుల జాబితా రిలీజ్


హెల్మెంట్ లేకుండా వాహనాన్ని నడిపినందుకు జరిమానా విధించినట్లు, ఒకవేళ జరిమానా విధించని యెడల కోర్టు ముందు హాజరపరచుతరంటూ వారు తనతో చెప్పినట్లు తుషార్ చెప్పుకొచ్చాడు. అయితే, ‘ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధించడం సాధారణం కానీ, అది నాకు సంబంధించినది కాదు. ఎందుకంటే ట్రాఫిక్ నిబంధనలను నేను ఉల్లంఘించలేదు. నేను ఎప్పుడూ కూడా కారులో ఎన్సీఆర్ ప్రాంతానికి వెళ్లలేదు. అలాంటిది నాకు ఫైన్ విధించారు. అయినా కారులో వెళ్తే హెల్మెంట్ ధరించడమేంటి..? కారులో వెళ్తున్నప్పుడు హెల్మెంట్ పెట్టుకోవాలన్న నిబంధన ఉంటే నాకు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలి’ అంటూ ఆయన పోలీసులను కోరినట్లు సక్సేనా వెల్లడించారు.

Also Read: అమిత్ షా కీలక ప్రకటన..కొత్తగా 5 జిల్లాలు

కాగా, సక్సేనా తన కారును గత ఏడాది మార్చిలో కొనుగోలు చేసినట్లు, వాహనం రిజిస్ట్రేషన్ ఘజియాబాద్ నుంచి రాంపూర్ కు బదిలీ చేయబడిందని పేర్కొన్నారు. ఈ చలానాపై విచారణ జరిపి దానిని రద్దు చేయాలంటూ అతను నోయిడా ట్రాఫిక్ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.

ఇదిలా ఉంటే.. ఝాన్సీలో కూడా ఇలాంటి పరిణామం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆడి కారును నడుపుతున్నప్పుడు హెల్మెంట్ ధరించనందుకు తనకు ట్రాఫిక్ పోలీసులు రూ. 1000 జరిమానా విధించారంటూ ఓ వ్యక్తి అధికారులను సంప్రదించారంటూ కూడా ఆ వార్తా కథనంలో పేర్కొన్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×