BigTV English

Sridevi: ప్రభాస్ మొదటి హీరోయిన్ రీఎంట్రీ.. ఏ సినిమాలో అంటే..?

Sridevi: ప్రభాస్ మొదటి హీరోయిన్ రీఎంట్రీ.. ఏ సినిమాలో అంటే..?

Sridevi:  శ్రీదేవి విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈశ్వర్ సినిమాతో శ్రీదేవి తెలుగుతెరకు పరిచయమైంది. దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా  ఉన్న ఆమె అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్రభాస్ సరసన  ఈ ముద్దుగుమ్మ  ఎంతో అందంగా కనిపించింది. అయితే ఈశ్వర్.. శ్రీదేవికి ఆశించినంత  విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది.


ఇక ఈ సినిమా తరువాత  నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ,  ఆది లక్ష్మి లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ, విజయం మాత్రం శ్రీదేవికి దక్కలేదు. ఇక దీంతో ఈ చిన్నది సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. 2009 లో రాహుల్ అనే వ్యక్తిని వివాహమాడింది. పెళ్లి తరువాత శ్రీదేవి హీరోయిన్ గా  కాకుండా..   కీలక పాత్రల్లో నటించింది. అలా రవితేజ హీరోగా నటించిన వీర చిత్రంలో అతనికి చెల్లెలిగా నటించి మెప్పించింది.

హీరోయిన్ గానే కాదు  సపోర్టింగ్ రోల్స్ లో కూడా ఆమె క్లిక్ అవ్వలేదు. దీంతో మొత్తానికే సినిమాలు వదిలేసి.. షోస్ కి జడ్జిగా రావడం మొదలుపెట్టింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా శ్రీదేవి అందం ఎక్కడా చెక్కు చెదరలేదు. ఆమెను చూసిన అభిమానులు మళ్లీ సినిమాలు చేయాలనీ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇక ఫ్యాన్స్ కోరికమేరకు శ్రీదేవి రీఎంట్రీ షురూ చేసింది.


నారా రోహిత్ హీరోగా నటిస్తున్న సుందరకాండలో శ్రీదేవి సపోర్టివ్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.  వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో శ్రీదేవి.. మోడ్రన్ లుక్ లో కనిపించి అదరగొట్టింది.  త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×