Suicide Note| ఓ యువకుడు గత నాలుగు రోజులుగా కనబడడం లేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్కడా అతని ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు ఇంట్లో అతని గదిలో అంతా వెతికారు. అక్కడ ఆ యువకుడు రాసిన సూసైడ్ లెటర్ కనిపించింది. ఆ లెటర్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఆ యువకుడిదేనని అతని తల్లిదండ్రులు ధృవీకరించారు. ఆ లెటర్ లో ఆ యువకుడు తన ఆత్మ హత్యకు తన భార్య, అత్తామామలు, పోలీసులే కారణమని రాశాడు. వీరంతా తనను మానసికంగా వేధించారని.. ఆ వేధింపులు తట్టుకోలేక చనిపోయేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. దీంతో పోలీసులకు ఆ సూసైడ్ నోట్ కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ జిల్లా లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. బారాబంకీ జిల్లా పరిధిలోని లాహీ గ్రామానికి చెందిన 25 ఏళ్ల రామ్ ప్రకాశ్ అనే యువకుడికి రెండేళ్ల క్రితం భానుప్రియ అనే యవతితో వివాహం జరిగింది. రామ్ ప్రకాశ్ ఢిల్లీలో ఉద్యోగం చేసేవాడు. పెళ్లి తరువాత తన భార్యతో ఢిల్లీలోనే కాపురం పెట్టాడు. వారిద్దరికీ ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. అయితే గత కొంత కాలంగా భానుప్రియ ఫోన్ లో తన మాజీ ప్రియుడితో మాట్లాడుతూ ఉంది. ఈ విషయం రామ్ ప్రకాశ్ కు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరికి భానుప్రియ భర్తను వదిలి పుట్టింటికి వచ్చేసింది. ఇద్దరి తల్లిదండ్రులు, పెద్దలు పంచాయితీ చేసి చివరికి భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చారు. ఆ తరువాత రామ్ ప్రకాశ్ తన భార్యను తీసుకొని మళ్లీ ఢిల్లీ వెళ్లిపోయాడు. అంతా బాగా జరుగుతుండగా.. నాలుగు నెలల క్రితం రామ్ ప్రకాశ్ మేనమామ చనిపోవడంతో ఆయన అంతక్రియలకు దంపతులిద్దరూ వచ్చారు.
Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్
అయితే అక్కడ భానుప్రియ మాజీ ప్రియుడు కనబడడంతో వారిద్దరూ మాట్లాడడం చూసి.. రామ్ ప్రకాశ్ తన భార్యపై కోపడ్డాడు. ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ గొడవలో భార్యను రామ్ చరణ్ కొట్టాడు. దీంతో భానుప్రియ పిల్లాడిని తీసుకొని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఈ సారి పంచాయితీలో భానుప్రియ తండ్రి కాలీచరణ్ తన కూతురిని సమర్థిస్తూ.. అల్లుడిని తిట్టాడు. కాలీచరణ్ ఒక పోలీస్ హోమ్ గార్డ్ ఉద్యోగం చేస్తున్నాడు. రామ్ ప్రకాశ్ వైపు నుంచి అతని తల్లిదండ్రులు, బంధువులు గొడవలోకి దిగారు. దీంతో గొడవ పెద్దదైంది. చివరికి ఇరు వర్గాలు కొట్టుకొని.. ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ తరువాత నుంచి పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది పోలీసులు రామ్ ప్రకాశ్ కు ఫోన్ చేసి భయపెట్టేవారు. రామ్ ప్రకాశ్ మామ కాలీచరణ్ స్వయంగా హోం గార్డు కావడంతో పోలీసుల చేత రామ్ ప్రకాశ్ కు ఫోన్ చేసి బెదిరించేవాడని రామ్ ప్రకాశ్ తండ్రి ఆరోపణలు చేశాడు. ఈ బెదిరింపులు తట్టుకోలేక రామ్ ప్రకాశ్ సూసైడ్ నోట్ రాసి ఎక్కడికో వెళ్లిపోయాడు. సూసైడ్ నోట్ లో తనకు ఫోన్ చేసి బెదిరించిన పోలీసుల పేర్లు, ఫోన్ నెంబర్లు కూడా రామ్ ప్రకాశ్ రాశాడు. ఈ లెటర్ తీసుకొని రామ్ ప్రకాశ్ జిల్లా ఎస్ పీ కార్యాలయంలో ఫిర్యాదుచేశాడు. దీంతో ఎస్ పీ.. రామ్ ప్రకాశ్ ని ఎలాగైనా వెతికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read: వెబ్ సిరీస్ చూసి బాలుడి మర్డర్.. ప్రేమ కోసం హంతకురాలిగా మారిన ఎంబిబియస్ విద్యార్థిని
గ్రామం పక్కనే ఉన్న నదిలో పడి రామ్ ప్రకాశ్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని.. అనుమానించి పోలీసులు 10 కిలోమీటర్ల మేర నది లో రామ్ ప్రకాశ్ శవం కోసం వెతికారు. కానీ ఎలాంటి ఫలితం లేదు. ఇంతవరకు రామ్ ప్రకాశ్ కనబడలేదు. ప్రస్తుతం కొడుకు కోసం ఒకవైపు రామ్ ప్రకాశ్ తల్లిదండ్రులు, మరోవైపు పోలీసులు గాలిస్తున్నారు. కేసు ఇంకా విచారణ దశలో ఉంది.
Also Read: ‘డబ్బులిస్తేనే శృంగారం’.. భార్య డిమాండ్.. కోర్టుకెక్కిన భర్త!