E-Paper
Advertisement

పెళ్లైన వారం రోజులకే.. విడాకులు మంజూరు, గుట్టు విప్పిన వధువు, ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?

పెళ్లైన వారం రోజులకే.. విడాకులు మంజూరు, గుట్టు విప్పిన వధువు, ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?
Advertisement

Marriage Ends Seven Days : ‘పెళ్లంటే పందిళ్లు‘ అనే పాట వివాహ వేడుకల విశిష్టతను చెబుతోంది. అగ్నిసాక్షిగా ఏడు అడుగులు నడిచిన వధువు ఆ ప్రమాణాలను తుంగలో తొక్కింది. ఫలితంగా వివాహం జరిగిన ఏడు రోజలకే విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కింది. ఫ్యామిలీ న్యాయస్థానం ఆ జంటకు విడాకులు మంజూరు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.

 

పెళ్లైన వారం రోజులకే విడాకులు మంజూరు

Advertisement

మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన అరుదైన ఘటన. వివాహం జరిగిన వారం రోజులకే ఓ నూతన జంటకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు దారితీసిన కారణాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇండోర్‌కు చెందినఓ యువకుడు వారం కిందట వివాహం చేసుకున్నాడు.

 

వధువు కీలక విషయాలు వెల్లడి

Advertisement

 

పెళ్లి తర్వాత అత్తవారింటికి వచ్చిన వధువు.. ఆ ఇల్లు తనకు నచ్చలేదని చెప్పేసింది. తాను ఇప్పటికే ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నానని, ఫ్యామిలీ ఒత్తిడితో ఈ పెళ్లికి ఓకే చేయాల్సి వచ్చిందని భర్త ఫ్యామిలీ సభ్యులకు వివరించింది. కోడలు మాటలతో అత్తింటివారు షాకయ్యారు. ఈ విషయం ముందుగా ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

ఈ విషయంలో దంపతుల తల్లిదండ్రులు వధువుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మార్పు రాకపోవడంతో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాయి. విడాకుల కేసుల్లో దంపతులు విడిపోవడానికి పెద్ద తతంగం ఉంటుంది. తొలుత కౌన్సెలింగ్, విచారణల ప్రక్రియ పూర్తి కావడానికి నెలలు పడుతుంది. , కొన్నిసార్లు ఏళ్లు గడిచిన సందర్భాలు ఉన్నాయి.

అరుదైన ఘటనగా చెబుతున్న న్యాయవాదులు

ఈ కేసులో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని గుర్తించిన న్యాయస్థానం, వేగంగా విచారణ చేపట్టింది. వధువు ఇప్పటికే మరో వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయాన్ని వివాహం జరిగిన వెంటనే వెల్లడించిందని న్యాయవాది కోర్టుకు దృష్టికి తెచ్చారు. దీనిపై ఆమె భర్త, కుటుంబ సభ్యులు విడాకుల విషయంలో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని వివరించారు.

అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, కేవలం ఏడు రోజుల్లో విడాకులు మంజూరు చేసింది. ఈ తరహా కేసుల్లో రాజీకి అవకాశం లేదని ఇరుపక్షాలకు ప్రయోజనకరం కాదని కోర్టు భావించినట్లు సదరు న్యాయవాది తెలిపారు. సుప్రీంకోర్టు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. ఆ విధానాన్ని అనుసరించి తీర్పు వెలువరించినట్లు పేర్కొన్నారు.

ALSO READ: CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే పై పోక్సో కేసు నమోదు!

న్యాయస్థానం నిర్ణయంతో ఇరు కుటుంబాలు న్యాయపోరాటం, మానసిక ఒత్తిడిని తప్పించుకున్నాయి. పెళ్లి జరిగిన వారం రోజుల్లో వివాహ బంధం ముగియడంతో మధ్యప్రదేశ్‌లో అరుదైన ఘటనగా చెబుతున్నారు న్యాయవాదులు.

 

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×