Best Sound System Cars India 2026: కారు కొనే సమయంలో చాలా మంది ఇంజిన్, మైలేజ్, సేఫ్టీ ఫీచర్లపై ఎక్కువ దృష్టి పెడతారు. కానీ, మ్యూజిక్ ఇష్టపడే వారికి కారులో ఉండే మ్యూజిక్ సిస్టమ్ కూడా అంతే ముఖ్యం. ఒకప్పుడు బ్రాండెడ్ సౌండ్ సిస్టమ్స్ కేవలం ఖరీదైన లగ్జరీ కార్లలో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు రూ.20 లక్షల లోపు ధరలోనే బోస్, JBL, హర్మన్ కార్డాన్ లాంటి ప్రీమియం ఆడియో సిస్టమ్ తో చాలా కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజుల్లో తయారీ సంస్థలు ప్రయాణాన్ని మరింత ఆనందంగా మార్చేందుకు ప్రముఖ ఆడియో బ్రాండ్లతో కలిసి బెస్ట్ సౌండ్ సిస్టమ్‌లను అందిస్తున్నాయి. మీరు కూడా మ్యూజిక్ లవర్స్ అయితే, ఈ కార్లను చెక్ చేయండి.
మహీంద్రా XUV 3XO ఈ లిస్టులో అత్యంత సరసమైన ఆప్షన్స్ లో ఒకటి. AX7 వేరియంట్ లో హర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ అందిస్తున్నారు. ఇందులో ఆరు స్పీకర్లు, యాంప్లిఫైయర్, సబ్‌వూఫర్ ఉండటంతో సంగీత అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది.
టాటా నెక్సాన్ లో Fearless+ PS వేరియంట్ నుంచి JBL ఆడియో సిస్టమ్ లభిస్తుంది. ఇందులో నాలుగు స్పీకర్లు, నాలుగు ట్వీటర్లు, ఒక సబ్ వూఫర్ ఉన్నాయి. ఇదే సిస్టమ్ నెక్సాన్ EVలో కూడా అందుబాటులో ఉంది.
కియా సెల్టోస్ HTX వేరియంట్ నుంచి ఎనిమిది స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్‌ను అందిస్తోంది. ఐదు స్పీకర్లు, రెండు ట్వీటర్లు, ఒక సబ్‌వూఫర్‌తో ఈ సెటప్ ప్రయాణ సమయంలో అద్భుతమైన ఆడియో ఎక్స్ పీరియెన్స్ అందిస్తుంది.
కియా సోనెట్ GTX+ వేరియంట్ లో కూడా బోస్ సౌండ్ సిస్టమ్ ఉంది. ఇందులో నాలుగు స్పీకర్లు, రెండు ట్వీటర్లు, ఒక సబ్ వూఫర్ ఉన్నాయి. చిన్న SUV అయినప్పటికీ మంచి సౌండ్ క్వాలిటీని అందిస్తుంది.
హ్యుందాయ్ వెర్నా SX(O) వేరియంట్‌లో ఎనిమిది స్పీకర్ల బోస్ ఆడియో సిస్టమ్ లభిస్తుంది. ఐదు స్పీకర్లు, రెండు ట్వీటర్లు, ఒక సబ్ వూఫర్‌తో ఈ సెడాన్‌లో మ్యూజిక్ అద్భుతంగా ఆస్వాదించవచ్చు.
ఎలక్ట్రిక్ కార్లలో MG విండర్స్ ఈవీ Essence వేరియంట్‌లో తొమ్మిది స్పీకర్ల ఆడియో సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఇందులో నాలుగు స్పీకర్లు, నాలుగు ట్వీటర్లు, ఒక సబ్ వూఫర్ ఉన్నాయి.
టాటా కర్వ్ లో ఆసీకంప్లిషెడ్ వేరియంట్ నుంచి JBL సౌండ్ సిస్టమ్ లభిస్తుంది. నెక్సాన్ లో ఉన్నట్లే ఇందులో కూడా నాలుగు స్పీకర్లు, నాలుగు ట్వీటర్లు, ఒక సబ్ వూఫర్‌తో కూడిన సెటప్ ఉంటుంది.
ఇందులో JBL బ్లాక్ ఆడియో సిస్టమ్‌తో పాటు సోనిక్ షాఫ్ట్ సౌండ్‌బార్, మొత్తం 12 స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్, హార్మన్ ఆడియోవర్క్స్ ప్రాసెసింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ లిస్టులో అత్యధిక స్పీకర్లు కలిగిన కారు ఇదే.
హ్యుందాయ్ క్రెటా SX ప్రీమియం వేరియంట్ లో కూడా ఎనిమిది స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ప్రయాణ సమయంలో మంచి సౌండ్ ఎక్స్ పీరియెన్స్ అందిస్తుంది.
చివరిగా మహీంద్రా థార్ రాక్స్ AX7L వేరియంట్‌లో హర్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్‌తో పాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా లభిస్తుంది. ఇందులో ఆరు స్పీకర్లు, రెండు ట్వీటర్లు, ఒక సబ్ వూఫర్ ఉండటంతో ఆఫ్ రోడ్ ప్రయాణాల్లో కూడా అద్భుతమైన మ్యూజిక్ ను ఎంజాయ్ చెయ్యొచ్చు.
Read Also: టియాగో ఈవీ To విండ్సర్ ఈవీ.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!