E-Paper
Advertisement

CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే పై పోక్సో కేసు నమోదు!

CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే పై పోక్సో కేసు నమోదు!
Advertisement

POCSO Case: CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే పై ఫోక్సో కేసు నమోదైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించిన నిరసనలో ఓ 12 ఏళ్ల మైనర్ బాలిక పాల్గోన్నారు. అయితే బాలికను ఎవరు తీసుకువచ్చారు అనే విషయంపై దర్యాప్తు జరపాలని కోరుతూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన న్యాయవాది రింకీ ఛటర్జీ సింగ్ సిలిగురిలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నీట్ పేపర్ లీక్..

అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, ఇతర నిర్వాహకులు మైనర్లను నిరసన ప్రదేశానికి తీసుకురావడానికి బాధ్యులని తన ఫిర్యాదులో న్యాయవాది రింకీ ఛటర్జీ ఆరోపించారు. ఘర్షణలు లేదా లాఠీచార్జ్ జరిగే అవకాశం ఉన్న ఇలాంటి ధర్ణాల్లో మైనర్ పిల్లలను భాగస్వామ్యం చేయడం వారి భద్రతను ప్రమాదంలో పడేయడమేనని రింకీ ఛటర్జీ పేర్కోన్నారు. జూలై 20 న నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.

Advertisement

Also read: రష్యాను వణికిస్తున్న రాక్షస మిడతల దండు.. భారీ ప్రమాదం అంచులో ఆసియా దేశాలు

క్షమాపణలు చెప్పాలని డిమాండ్..

అయితే పోలీసుల లాఠీచార్జ్ తర్వాత సోషల్ మీడియాలో ఒక వీడియోను అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్ పోస్ట్ చేశారు. పోలీసులు నిరసనలో ఉన్న 12 ఏళ్ల బాలికలపై కూడా లాఠీచార్జ్ చేశారని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని అభిజిత్ దీప్కే డిమాండ్ చేసారు. అసలు అంత చిన్న వయసున్న 12 ఏళ్ల బాలికను ఆ నిరసన ప్రదేశానికి ఎవరు తీసుకువచ్చారు? అని రింకీ ఛటర్జీ ప్రశ్నించారు. సంరక్షణ, రక్షణ అవసరమైన మైనర్లను రాజకీయ లేదా సామాజిక ఆందోళనల్లోకి లాగడం చట్టవిరుద్ధమన్న న్యాయవాది రింకీ ఛటర్జీ తెలిపారు.

ఫోక్సో కేసు..

Advertisement

దీనిపై CJP నిర్వాహకులపై ఒక జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని న్యాయవాది రింకీ ఛటర్జీ డిమాండ్ చేశారు. మైనర్లను ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టినందుకు పోక్సో చట్టంలోని సెక్షన్లు 13, 14, 15 కింద చర్యలు తీసుకోవాలని రింకీ ఛటర్జీ కొరారు. నిరసనల్లో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినందుకు సెక్షన్ 153 కింద కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనల వెనుక ఎవరి హస్తం ఉంది. వీటికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే కోణంలో ‘డీప్ స్టేట్’ ప్రమేయంపై కూడా దర్యాప్తు జరపాలని అధికారులను న్యాయవాది రింకీ ఛటర్జీ డిమాండ్ చేశారు.

Also Read: వైద్యురాలి తలపైకి కారు ఎక్కించి.. రాజమండ్రిలో దారుణం, మాల్‌లో యువకులు అఘాయిత్యం

Tags

Related News

యూపీఐ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. పేమెంట్స్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం!

తరుణ్ తేజ్‌పాల్‌ లైంగిక వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు!

పెళ్లైన వారం రోజులకే.. విడాకులు మంజూరు, గుట్టు విప్పిన వధువు, ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?

రెండు దశాబ్దాల బంధానికి ముగింపు.. ప్రియుడితో భార్య పెళ్లి చేసిన భర్త, యూపీలో ఆ ప్రేమకుడు ఎవరు?

ప్రయాణికుడిపై ఓ కండక్టర్ ప్రతాపం.. మండిపడిన నెటిజన్స్, కండక్టర్ సస్పెండ్

మీనాక్షినటరాజన్ కేసులో బిగ్ ట్విస్ట్.. బీజేపీ ఎంపీలు, ఎన్నికల అధికారికి హైకోర్టు నోటీసులు జారీ..!

దేశంలో మరో ఉగ్ర కుట్ర భగ్నం.. 9 మంది అరెస్టు.. భారీగా ఆయుధాలు స్వాధీనం!

Big Stories

Advertisement
×