Pakistan Drone Attack: పాక్ బరితెగించింది. భారత్‌లోని జమ్ము సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు దాడులకు దిగింది. లైన్ ఆఫ్ కంట్రోల్‌లోని 26 ప్రదేశాలలో డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది. అయితే వీటిని భారత్ సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టింది. ఉత్తరాన బారాముల్లా నుంచి దక్షిణాన భుజ్ వరకు ఈ దాడులకు తెగబడింది. ఇప్పటి వరకు భారత సైనిక స్థావరాలు, ఎయిర్ పోర్టులు, ప్రార్ధన మందిరాలు టార్గెట్‌గా డ్రోన్, మిసైల్ దాడులకు ప్రయత్నించిన పాక్.. జనవాసాలపై దాడులకు తెగబడింది. నిన్న రాత్రి భారత్‌లోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు దిగింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో ఎటాక్ చేసింది.
భారత్ లోని సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చూస్తూ పాకిస్తాన్ దాడులకు పాల్పడుతోంది. తాజాగా జమ్ములోని నివాస ప్రాంతాలపై దాడులకు తెగబడింది. ఈ దాడిలో పలు ఇళ్లు, కార్లు ధ్వంసం అయ్యాయి. మిలటరీ స్థావరాలకు సమీపంలోని ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని పాక్ దాడులకు తెగబడుతోంది. డ్రోన్లతో విరుచుకుపడుతోంది. జమ్ముతో పాటు పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ జిల్లాలో కూడా దాడులకు తెగబడింది పాక్. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. పాక్ చేస్తున్న దాడులను భారత బలగాలు ఎప్పటికప్పుడు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయి. జమ్ముకు సమీపంలో టెర్రరిస్టు లాంఛ్ ప్యాడ్‌లను భారత్ కూల్చివేసింది. పాకిస్తాన్‌కి చెందిన నాలుగు ఎయిర్ బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది.
ఈ దాడిలో ఓ కుటుంబం గాయాలపాలైంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. డ్రోన్ దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డ్రోన్ ఎటాక్ నేపథ్యంలో అలర్ట్ అయిన భారత సైన్యం.. ఫిరోజ్ పూర్ లో పూర్తిగా బ్లాక్ అవుట్ ప్రకటించింది. నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేసింది. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది.
Also Read: రాజౌరీలో పాకిస్తాన్ కాల్పులు.. భారత్ కీలక అధికారి మృతి
బారాముల్లా, శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, లాల్‌గఢ్ జట్టాతో పాటు..జైసల్మేర్, బార్మర్, భుజ్, కుర్బెట్ లఖి నాలా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు యత్నించిందని భారత సైన్యం తెలిపింది. అయితే ఈ డ్రోన్ దాడులకు సమవర్ధవంతంగా తిప్పికొడుతున్నట్లు స్పష్టం చేసింది సైన్యం. వీటిలో కొన్ని ఆయుధాలతో కూడిన డ్రోన్లు ఉన్నాయని అనుమానిస్తున్నారు. పాక్ డ్రోన్ల దాడులతో..భారత దళాలు అప్రమత్తతను కొనసాగిస్తున్నాయి. ఎక్కడికక్కడ పాక్ డ్రోన్ల దాడులను తిప్పుకొడుతున్నాయి. వైమానిక బెదిరింపుల ట్రాక్ చేసి, కౌంటర్-డ్రోన్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయి.
రత గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, నిఘా సమాచార సేకరణే లక్ష్యంగా పాక్ డ్రోన్ల దాడులు చేసిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం టర్కికు చెందిన ఆసిస్‌గార్డ్ సోంగర్ డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిసిందన్నారు. సరిహద్దుల్లోని సాధారణ పౌరులు, పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. పాక్ దాడుల్లో అనేకమంది గాయపడ్డారని చెప్పారు. ప్రార్థనా మందిరాలు, స్కూల్లు, గురుద్వారాలే లక్ష్యంగా పాక్ దాడులు చేస్తోందని..ఓ వైపు దాడులు చేస్తూ… ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని విమర్శించారు.