BigTV English

OTT Movie : ఈ సినిమా చూశాక సముద్రం అంటేనే చెమటలు… మస్ట్ వాచ్ సీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్

OTT Movie : ఈ సినిమా చూశాక సముద్రం అంటేనే చెమటలు… మస్ట్ వాచ్ సీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్

OTT Movie : సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాలలో ఉండే కిక్కే వేరప్పా. అందుకే చాలామంది ఇలాంటి సినిమాల కోసమే ప్రత్యేకంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో తెగ వెతికేస్తుంటారు. వీటిని తెరపై చూస్తుంటే ఏదో కొత్త ప్రపంచాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇటువంటి సినిమాలలో బో*ల్డ్ కంటెంట్ ప్రస్తావన తక్కువగా ఉండటం వల్ల ఫ్యామిలీతో కలసి చూసే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా పురాతన కాలం నాటి ఒక భారీ షార్క్ చేసే దాడితో మొదలవుతుంది. ఆ తరువాత స్టోరీ యాక్షన్ సీన్స్ తో అదరిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


స్టోరీలోకి వెళితే
జాక్ మోరిస్ అనే బిలియనీర్ ఒక పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభిస్తాడు. దీనిని సముద్రం లోపల రహస్యంగా నడుపుతుంటాడు. ఈ బృందంలో శాస్త్రవేత్తలైన డాక్టర్ మిన్వే జాంగ్, అతని కుమార్తె సుయిన్, మరికొంత మంది ఇతర సభ్యులు కూడా ఉంటారు. వాళ్ళు ఒక సబ్ మెరైన్ లో పరిశోధనలు చేస్తుంటారు. పరిశోధనలు చేస్తున్న సమయంలో సబ్ మెరైన్ పై ఒక భారీ జీవి దాడి చేస్తుంది. ఈ ప్రమాదం వల్ల అందులో ఉన్న వాళ్ళు, సముద్ర లోతుల్లో చిక్కుకుపోతారు.

ఈ భారీ జీవి 75 అడుగుల పొడవు ఉంటుంది. మొత్తానికి సైంటిస్ట్ లు లక్షల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఒక భారీ షార్క్ గా దీన్ని గుర్తిస్తారు. ఈ ప్రమాదాన్ని రెస్క్యూ చేయడానికి, జోనాస్ టేలర్ అనే వ్యక్తిని పిలిపిస్తారు. జోనాస్ కు గతంలో ఇటువంటి ప్రమాదాలను ఎదుర్కొన్న అనుభవం ఉంటుంది. జోనాస్, సుయిన్, శాస్త్రవేత్తల బృందం కలసి ఆ రాకాసి షార్క్ ను ఎదుర్కోవడానికి ఒక ప్రమాదకరమైన ప్రణాళికను రూపొందిస్తారు.


ఈ షార్క్ అదే సమయంలో సముద్ర తీరానికి సమీపంలోని బీచ్‌లపై దాడి చేస్తుంది. ఈ దాడిలో వందల మంది ప్రాణాలు కోల్పోతారు. మరోవైపు జోనాస్, శాస్త్రవేత్తల బృందం కలసి, ఆ షార్క్ ను సముద్ర లోతుల్లోకి తీసుకెళ్లి చంపడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో జోనాస్ ప్రమాదంలో ఉన్న సుయిన్ కుమార్తె మీయింగ్ ని కాపాడతాడు. దీనివల్ల జోనాస్, సుయిన్ మధ్య మంచి బంధం ఏర్పడుతుంది. ఇంతలో జోనాస్ షార్క్ పై దాడి చేసి గాయపరుస్తాడు. దాని నుంచి రక్తం బయటికి వస్తుంది. ఆ రక్తం వాసకి కొన్ని షార్క్‌ లు అక్కడికి వచ్చి, ఆ పెద్ద షార్క్ ని చంపి తినడానికి ప్రయత్నిస్తాయి. చివరికి ఈ దాడిలో ఆ రాకాసి షార్క్‌ చనిపోతుందా ? ఈ ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళు సురక్షితంగా బయట పడతారా ? ఇంకా ఏమైనా ప్రమాదాలు వస్తాయా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : అంతుచిక్కని వ్యాధితో వరుస మరణాలు… మతిపోగొట్టే ట్విస్ట్ లున్న సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్

రెండు ఓటిటిలలో స్ట్రీమింగ్
ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు’ది మెగ్’ (The Meg). 2018లో వచ్చిన ఈ మూవీకి జాన్ టర్టెల్‌టాబ్ దర్శకత్వం వహించారు. ఇందులో జాసన్ స్టాథమ్, లి బింగ్‌బింగ్, రైన్ విల్సన్, రూబీ రోజ్, విన్స్టన్ చావ్, షూయా సోఫియా కై వంటి నటులు నటించారు. ఈ సినిమా స్టీవ్ ఆల్టెన్ 1997లో రాసిన ‘Meg: A Novel of Deep Terror’అనే నవల ఆధారంగా తెరకెక్కింది. నెట్ ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×