BigTV English
Advertisement

India : పాక్‌పై మళ్లీ అటాక్? అందుకేనా ఆ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్?

India : పాక్‌పై మళ్లీ అటాక్? అందుకేనా ఆ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్?

India : మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్. అపరేషన్ అభ్యాస్ పేరుతో యుద్ధ సన్నద్దతపై సమీక్ష. ఒక రోజు ముందుగా అన్ని రాష్ట్రాలకు మెసేజ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మాక్‌డ్రిల్‌తో దేశ ప్రజలందరినీ అలర్ట్ చేసింది. అదే రోజు అర్థరాత్రి పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్‌తో అటాక్ చేసింది ఇండియన్ ఆర్మీ. 25 నిమిషాల్లో పీవోకే, పాక్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. 100 మంది టెర్రరిస్టులను ఖతం చేసింది. ఇదంతా తెలిసిన విషయమే. ఇప్పుడు లేటెస్ట్ మేటర్ ఏంటంటే..


మే 29న మాక్ డ్రిల్..

మే 29న మళ్లీ మాక్ డ్రిల్. ఈసారి దేశ వ్యాప్తంగా కాదు. నాలుగు సరిహద్దు రాష్ట్రాల్లో మాత్రమే. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్‌లో యుద్ధ సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై మాక్‌డ్రిల్‌తో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఆ మేరకు ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.


మళ్లీ ఎందుకు..?

ఇటీవలే ఆపరేషన్ సిందూర్‌తో ఆ నాలుగు స్టేట్స్ యుద్ధాన్ని కళ్లారా చూశాయి, అనుభవించాయి. పాక్ డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలు.. భారత సరిహద్దు జిల్లాల్లోకి దూసుకొచ్చాయి. మన ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్ వాటన్నిటినీ గాలిలోనే పేల్చిపడేసింది. S 400 సుదర్శన చక్రంలా మన గగనతలాన్ని కాపాడింది. పాక్ దాడి చేసే సమయంలో ప్రభావిత ప్రాంతాల్లో కరెంట్ కట్ చేసి.. బ్లాక్ అవుట్ కూడా నిర్వహించారు. యుద్ధం జరుగుతుంటే ఎలా వ్యవహరించాలో అక్కడి వాళ్లందరికీ బాగా తెలిసొచ్చింది ఇప్పటికే. అలాంటిది మళ్లీ మాక్ డ్రిల్ ఎందుకు?

పాక్‌పై మళ్లీ అటాక్?

గతంలో మే 7న జరిగినట్టే.. మే 29న మాక్ డ్రిల్ తర్వాత మళ్లీ పాకిస్తాన్‌పై ఇండియన్ ఆర్మీ అటాక్ చేయబోతోందా? అనే అనుమానం. ఆ రోజు మాక్ డ్రిల్ జరిగిన నాడే ఆపరేషన్ సిందూర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొన్నిరోజుల పాటు పెద్ద ఎత్తున బాంబార్డ్ జరిగింది. పాకిస్తాన్‌ తుక్కు రేగ్గొట్టింది మన ఆర్మీ. పాక్ ఎయిర్‌బేస్‌లు ధ్వంసం అయ్యాయి. యుద్ధ విమానాలు నేల కూలాయి. టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్‌లు స్మాష్ అయ్యాయి. అదే టైమ్‌లో దాయాది దేశం మన మీదకు వదిలిన వందలాది డ్రోన్లను నేటమట్టం చేశాం. క్షిపణులను సైతం పేల్చేశాం. ఫైటర్‌జెట్స్‌ను కూల్చేశాం. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ లబోదిబో మంది. మన బ్రహ్మోస్ క్షిపణి ధాటికి ఆ దేశ అణ్వస్త్రాలు సైతం డ్యామేజ్ అయ్యాయని ప్రచారం జరిగింది.

ఆపరేషన్ సిందూర్ కంటిన్యూ..

అమెరికా జోక్యంతో యుద్ధం ఆగినా.. ఆపరేషన్ సిందూర్ మాత్రం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించింది కేంద్రం. అన్నట్టుగానే.. భారత్ మరోసారి సిందూర్‌ను కంటిన్యూ చేయబోతోందా? ఆ నాలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ అందుకేనా? మే 29 మిడినైట్ మరోసారి పాకిస్తాన్‌పై ఇండియన్ ఆర్మీ దాడి చేయబోతోందా? అందుకే సరిహద్దు స్టేట్స్‌ను సన్నద్ధం చేస్తోందా?

Related News

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Big Stories

×