Big Stories

Modi Indonesia Tour : ముగిసిన మోదీ ఇండొనేషియా టూర్..

Modi Indonesia Tour : ఇండోనేషియాలో జీ20 దేశాల సదస్సు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాధినేతలతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. యూకే ప్రధాని రిషి సునక్, ఆస్ట్రేలియా ప్రధాని అల్బెన్సీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలనీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.

- Advertisement -

సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై యూకే , ఆస్ట్రేలియా ప్రధానిలతో మోదీ చర్చించారు. భారత్ తో ఇతర దేశాల సంబంధాలు మరింత మెరుగుపడాలని మోదీ కోరారు. ఇరుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా వివిధ రంగాలకు చెందిన అంశాలపై దేశాధినేతలు చర్చించారు. వాణిజ్యం, శక్తి, రక్షణ, ఉగ్రవాదం సహా పలు కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి.

- Advertisement -

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి మోదీ విశిష్టమైన కానుక ఇచ్చారు. ఎంతో నైపుణ్యంతో రూపొందించిన ‘పటాన్ పటోలా దుపట్టా’ను ఆమెకు బహూకరించారు. భారత్ నేతన్నల పనితనానికి మచ్చుతునకలా నిలిచే ఈ స్కార్ఫ్ అందుకున్న మెలోనీ మురిసిపోయారు.

జీ20 సదస్సు కోసం వెళ్లిన ప్రధాని మోదీ టూర్ ముగిసింది. తెల్లవారుజామున ప్రధాని భారత్ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి అధికారులు ఘనస్వాగతం పలికారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News