Eagle ott release date(Today tollywood news): మాస్ మహారాజ రవితేజ ప్రేక్షకులను అలరించేందుకు వరుసపెట్టి సినిమాలు తీస్తున్నాడు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే రవితేజ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో మంచి హిట్ సాధించాలనుకున్నాడు. కానీ, ఆ సినిమా ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
దీంతో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగల్’ మూవీ చేశాడు. ఎన్నో అంచనాల నడుమ ఈ నెల 9న థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ షో నుంచే పర్వాలేదు అనిపించుకుంది. కానీ వసూళ్లలో మాత్రం తన హవా చూపించలేక పోయింది. ఇక ఈ మూవీ ఇప్పటి వరకు రాబట్టిన కలెక్షన్స్ చూస్తే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి మొత్తం రూ.14 కోట్ల షేర్ (రూ.25 కోట్ల గ్రాస్) కలెక్షన్లను వసూళు చేసినట్లు తెలుస్తోంది.
అలాగే ప్రపంచ వ్యాప్తంగా రూ.18 కోట్ల షేర్ (రూ.36 కోట్ల గ్రాస్) కలెక్షన్లను సాధించినట్లు తెలుస్తోంది. ఇక థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
READ MORE: రవితేజ ‘ఈగల్’ రెండో రోజు కలెక్షన్స్.. ఎంత వచ్చిందంటే?
దీంతో శివరాత్రి సందర్భంగా మార్చి 8న ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
ఇక మరోవైపు ఈ మూవీ శాటిలైట్ హక్కులు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ టీవీ ఛానెల్ ఈటీవీ ఈ మూవీ శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసినట్టు సినీ వర్గాల సమాచారం.
ఈ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కాగా రూ.22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈగల్ మూవీ.. రూ.3 కోట్ల దూరంలో ఉండిపోయింది.
ఈ మూవీలో రవితేజ హీరోగా నటించగా.. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించారు. అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల వంటి నటీనటులు కీలక పాత్రలో నటించి మెప్పించారు.
READ MORE: ఈగల్ రివ్యూ.. మాస్ మహారాజా డిజాస్టర్ రికార్డుల నుంచి తేరుకున్నాడా..?
ఇకపోతే ప్రస్తుతం రవితేజ పలు మూవీలతో బిజీగా ఉన్నాడు. క్రాక్ సినిమా తర్వాత మరోసారి దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ పవర్ఫుల సినిమా చేస్తున్నాడు. అలాగే దర్శకుడు హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో కూడా ‘మిస్టర్ బచ్చన్’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.