Big Stories

Mumbai Hoarding Collapse: ముంబైలో గాలివాన బీభత్సం.. 14 మంది మృతి!

Mumbai Hoarding Collapse: ముంబైలో గాలివాన బీభత్సం సృష్టించింది. కుర్లా, ఘాట్ కోపర్, ములుండ్, విఖ్రోలి, దక్షిణ ముంబయి, మాహిమ్, దాదర్ లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వర్షం కురిసింది. వర్షానికి ముందు బలమైన ఈదురు గాలులు వీచాయి. పలుచోట్లా దుమ్ము దట్టంగా ఎగిసిపడింది. వర్షం, ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు మార్గాల్లో మెట్రోసేవలను నిలివేశారు. అదేవిధంగా రెండు గంటలకు పైగా లోకల్ రైలు సేవలను కూడా నిలిపివేసినట్లు సమాచారం.

- Advertisement -

కోపర్ లోని సమతా నగర్ లో ఈదురుగాలుల తీవ్రతకు ఓ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న ఎత్తైన ఇనుప హోర్డింగ్ విరిగిపడింది. ఈ ఘటనలో 14 మంది దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. సుమారు 60 వరకు గాయపడినట్లు సమాచారం. హోర్డింగ్ కూలిన సమాచారం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే, ఈ హోర్డింగ్ ను ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసినట్లు ముంబై నగర పాలక సంస్థ అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

అదేవిధంగా వడాలాలోని బర్కత్ అలీ నాకాలో ఉన్న శ్రీజీ టవర్ వద్ద వడాలా-అంటోప్ హిల్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ ఈదురుగాలులకు రోడ్డుపై కుప్పకూలింది. ఈ ఘటనలో కూడా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

Also Read: కార్యకర్తను తోసేసిన లాలూ ప్రసాద్ కుమారుడు.. వీడియో

అయితే, ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా సతమతమవుతున్న ముంబైలో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులు, వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News