E-Paper
Advertisement

అస‌లు బీసీసీఐకి సిగ్గుందా? ప్లాట్ పిచ్ లు పెట్టి, టీమిండియా బౌల‌ర్లను చంపేస్తారా ?

అస‌లు బీసీసీఐకి సిగ్గుందా? ప్లాట్ పిచ్ లు పెట్టి, టీమిండియా బౌల‌ర్లను చంపేస్తారా ?
Advertisement

Tanveer Ahmed Slams Team India Bowling: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య నిన్న జరిగిన నాలుగవ టి20 లో శ్రేయస్ అయ్యర్ సేన ఘోరంగా ఓడిపోయింది. బ్యాటర్లు రాణిస్తున్నప్పటికీ బౌలింగ్ దళం పరమ చెత్తగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే విండీస్ బ్యాటర్లు ఊచకోత కోస్తూ పరుగులు రాబడుతున్నారు. అయితే హైదరాబాద్ వేదికగా జరిగిన నాలుగో టి20 సందర్భంగా మరోసారి టీమిండియా బౌలర్లు విఫలమైన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మ‌ద్ హేళన చేస్తూ మాట్లాడారు.

బుమ్రా ఒక్కడు లేకపోతే పాకిస్తాన్ కంటే దారుణంగా టీమిండియా మారుతోందని బాంబు పేల్చారు. ఫ్లాట్ మైదానాలు టీమిండియా కొంప ముంచుతాయని ముందు నుంచి తాను చెబుతున్నానని గుర్తు చేశారు. ఇప్పుడు అవే ఫ్లాట్ మైదానాలు టీమిండియా బౌలర్లకు శాపంగా మారాయని ఆగ్రహించారు. ఇప్ప‌టికైనా దీనిపై బీసీసీఐ మొద్దు నిద్ర లేవకుండా వ్యవహరిస్తే… టీమిండియా బౌలర్ల కెరీర్ సర్వనాశనం కావడం గ్యారెంటీ అన్నారు. ఐదు నుంచి 6 ఎకనామీ ఉన్నవాళ్లు 13 ఎకనామీకి చేరుకోవడం చూస్తుంటే టీమిండియా బౌలింగ్ ఎంత దిగజారిందో అర్థం అవుతుంద‌న్నారు.

అస‌లు బీసీసీఐకి సిగ్గుందా? ప్లాట్ పిచ్ లు పెట్టి, టీమిండియా బౌల‌ర్లను చంపేస్తారా ?

Advertisement

వెస్టిండీస్ తో జరుగుతున్న టి20 సిరీస్ సందర్భంగా భారత బౌలర్ల వైఫల్యాన్ని ఉద్దేశించి తన్వీర్ అహ్మద్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బుమ్రా ఒక్కడు లేకపోతే టీమిండియా బౌలింగ్ దళం అధ్వానంగా తయారైందని హేళన చేశారు. ప్రతి బంతి సిక్సర్ లేదా బౌండరీ కొడుతున్నారంటే, టీమిండియా బౌలర్ల ప్రదర్శన ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. భారత బౌలింగ్ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ టి20 సిరీస్ కోల్పోవడం గ్యారంటీ అని హెచ్చరించారు.

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

Advertisement

బుమ్రా ఆడిన ప్రతి మ్యాచ్ టీమ్ ఇండియా గెలుస్తుందని తెలిపారు. అయితే అతడు ఒక్కడు లేకపోయే సరికి టీమిండియా బౌలర్లు గందరగోళానికి గురవుతున్నారని ప‌రువు తీశారు. టీమిండియా బౌల‌ర్ల‌ కంటే తమ పాకిస్తాన్ బౌలర్లే బెటర్ అన్నారు. తమ వాళ్ళు ఎన్నడూ కూడా 250 పరుగులు ఇవ్వలేదని సెటైర్లు పేల్చారు. ఫ్లాట్ మైదానాలు తయారు చేసి టీమిండియా బౌల‌ర్ల‌ను బీసీసీఐ చంపేసేలా కనిపిస్తోందని తన్వీర్ అహ్మ‌ద్ వివాదస్ప‌ద‌ వ్యాఖ్యలు చేశారు.

షాయ్ హోప్ ఊచ‌కోత‌పై త‌న్వీర్ అహ్మ‌ద్ ప్ర‌సంశ‌లు

వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ ఇండియాను ఊచకోత కోస్తున్నాడని తన్వీర్ అహ్మ‌ద్ వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇండియాపై సెంచరీలు చేసినట్టుగానే అతడు కూడా ఇరగదీస్తున్నాడని ప్రశంసించారు. ఫర్హాన్ కూడా ఇండియాను చీల్చి చెండాడాడని… ఇప్పుడు షాయ్ హోప్ అదే పని చేస్తున్నాడని వెల్లడించారు. ఇదే ఊపు కొనసాగించాలని కోరారు.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

 

Related News

అర్షదీప్ సింగ్ కు గాయం…ఐదో టీ20 కోసం రంగంలోకి భువ‌నేశ్వ‌ర్ కుమార్ ?

బుమ్రా లేక‌పోతే ఇంత దిగజారుతారా? మీ కంటే పాకిస్తాన్ వెధ‌వ‌లే బెట‌ర్‌

టీమిండియాను ఓడించి, గంభీర్ కు బ‌ర్త్ డే గిఫ్ట్ ఇచ్చా !

అభిషేక్ కు ఛేజింగ్ చేత‌కాదు..200ల‌పైగా టార్గెట్ ఉంటే ప్యాంట్ త‌డుపుకుంటున్నాడు

కొంప‌ముంచిన న‌మ‌న్ ధీర్ స్టంప్ ఔట్…ఉప్ప‌ల్ లో టీమిండియా ఘోర ఓట‌మి

టాస్‌లోనూ కుట్రలు…రవిశాస్త్రి, శ్రేయస్‌ను అవమానించిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్

స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

Big Stories

Advertisement
×