Unlucky 11 Number: అహ్మదాబాద్ లోని విమానాశ్రయం దగ్గర ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి.. 270 కి పైగా జనాలు మరణించిన సంగతి తెలిసిందే. ఇందులో 241 మంది ప్రయాణికులు మృతి చెందగా… మెడికోలు అలాగే అక్కడ ఉన్న సాధారణ ప్రజలు కూడా మరణించారు. అయితే ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో…. 11 నెంబర్ గురించి మరోసారి చర్చ జరుగుతోంది. అదే సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీకి వచ్చిన సీట్లను కూడా… గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి.
Also Read: Shubman Gill: సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న శుభ్‌మన్ గిల్… ఈ ఓవర్ యాక్షనే తగ్గించుకో అంటూ ట్రోలింగ్
11వ నెంబర్ సీట్లో కూర్చొని బతికి బయటపడ్డ మృత్యుంజయుడు
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో.. 242 మంది ప్రయాణికులు ఉంటే 241 మంది మరణించారు. ఇందులో ఒకే ఒక్కడు మాత్రమే బతికి బయటపడ్డాడు. అతని పేరే రమేష్ విశ్వాస్. ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు దూకడంతో.. రమేష్ బతికాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు రమేష్. అయితే.. ఎయిర్ ఇండియా అభిమానంలో 11వ నెంబర్ సీట్లో కూర్చోవడంతో అతడు.. బతికి బయటపడ్డాడు. ఈ నేపథ్యంలోనే పదకొండవ నెంబర్ గురించి సోషల్ మీడియాలో మళ్లీ చర్చ జరుగుతోంది.
తొక్కి సలాటలో 11 మంది ఆర్సీబీ ఫ్యాన్స్ మృతి
18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ లందరూ పరేడ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మొన్న చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసేలాట జరిగి 11 మంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు మృతి చెందారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా బెంగళూరు అభిమానుల మృతి వార్త హాట్ టాపిక్ అయింది. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు అందరిని చూడడానికి వెళ్లి ఈ 11 మంది మృతి చెందడం గమనార్హం.
జగన్ కు వచ్చిన సీట్లు 11 ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కేవలం 11 అసెంబ్లీ సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో… అత్యంత దారుణంగా ఓడిపోయిన వైసీపీ పార్టీ… ఏపీలో అధికారాన్ని కూడా కోల్పోవడం జరిగింది. అదే సమయంలో ఏపీలో కలిసి పోటీ చేసిన కూటమికి 160 కి పైగా స్థానాలు దక్కడం జరిగింది. దీంతో ఇప్పుడు వైసీపీ పార్టీని ఒక ఆట ఆడుకుంటుంది కూటమి.
సంధ్య థియేటర్ ఘటనలో A11 గా అల్లు అర్జున్
హీరో అల్లు అర్జున్ నటించిన తాజా సినిమా పుష్ప 2. ఈ సినిమా దాదాపు 2,000 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. అయితే… పుష్ప 2 రిలీజ్ అయిన మొదటి రోజే తొక్కిసలాట జరిగింది. హైదరాబాదులోని సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో… ఏకంగా ఓ మహిళ మరణించడమే కాకుండా ఆమె కుమారుడు… ఆసుపత్రి పాలయ్యాడు. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్టు కూడా చేశారు. ముఖ్యంగా ఈ కేసులో A11 గా అల్లు అర్జున్ పైన కేసు నమోదు అయింది. ఇలా 11 నెంబర్ చుట్టే అన్ని సంఘటనలు జరుగుతున్నాయి.
Also Read: WTC- Handling The Ball: WTC ఫైనల్‌లో అనూహ్య ఘటన..ఏంటి ఈ ‘హ్యాండిల్డ్ ది బాల్’ వివాదం ?
?igsh=aXJmNHE2a2xsOHE1