BigTV English

Anurag Thakur: ‘కులమే లేనివాడు కులగణన గురించి మాట్లాడుతున్నాడు’.. రాహుల్ గాంధీని అవమానిస్తూ.. అనురాగ్ ఠాకుర్ వ్యాఖ్యలు

Anurag Thakur: ‘కులమే లేనివాడు కులగణన గురించి మాట్లాడుతున్నాడు’.. రాహుల్ గాంధీని అవమానిస్తూ.. అనురాగ్ ఠాకుర్ వ్యాఖ్యలు

Anurag Thakur Rahul Gandhi Lok Sabha Debate: పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ చర్చల సందర్భంగా కులగణన అంశంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, బిజేపీ ఎంపీ అనురాగ్ ఠాకుర్ మధ్య మంగళవారం మాటలయుద్ధం జరిగింది. ఈ క్రమంలో అనురాగ్ ఠాకుర్.. రాహుల్ గాంధీకి అసలు కులమే లేదు.. అంటూ అవమానకర వ్యాఖ్యలు చేయగా.. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేష్ యాదర్ రాహుల్ గాంధీకి మద్దతుగా అధికార కూటమి పార్టీ ఎంపీల ప్రవర్తను తప్పుబట్టారు. ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు లోక్ సభలో ఠాకుర్ వ్యాఖ్యాల పట్ల నిరసన చేశారు. దీంతో లోక్ సభ వాతావరణం వేడెక్కింది.


అనురాగ్ ఠాకుర్ ఏమన్నారంటే..
లోక్ సభ వర్షకాల సెషన్ లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలు కులగణన అంశం లేవనెత్తారు. దేశంలో కులగణన జరగాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ వాదించారు. దీనిపై బిజేపీ ఎంపీ అనురాగ్ ఠాకుర్ స్పందిస్తూ.. ”కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రధాన మంత్రుల సమయంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. ఇప్పుడు వీళ్లేమో వెనుకబడిన కులాల గురించి ఓబిసీల గురించి మాట్లాడుతున్నారు. వీళ్లకు అసలు ఓబీసీ అంటే ఓన్లీ బ్రదర్ ఇన్ లా కమిషన్ (రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాను ఉద్దేశిస్తూ). తన కులమేదో తెలియన వ్యక్తి కులగణన గురించి మాట్లాడుతున్నాడు. అసత్యానికి కాళ్లు ఉండవంటారు. అందుకే రాహుల్ గాంధీ తన భూజాలపై అసత్యన్ని మోసుకొస్తున్నారు ” అని రాహుత్ గాంధీని ఎద్దేవా చేశారు.

ఠాకుర్ చేసిన అవమానకర వ్యాఖ్యల తరువాత కాంగ్రెస్ ఎంపీలు, సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు బిజేపీ ఎంపీలు కూడా వారికి వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో ఇరు వర్గాల మధ్య దూషణ పర్వం మొదలైంది.


రాహుల్ గాంధీ స్పందన
అనురాగ్ ఠాకుర్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. ముందుగా కాంగ్రెస్ ఎంపీలను శాంతపరిచి ఆ తరువాత మాట్లాడుతూ.. ”దళితుల గురించి, వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడే వారిని బిజేపీ వాళ్లు అవమానిస్తూనే ఉంటారు. నన్ను అవమానించడం వాళ్లకు అలవాటై పోయింది. వీళ్లు ఎన్నిసార్లు నన్ను అవమానించినా సరే. అర్జునుడి గురి చేప కన్ను మీద ఉన్నట్లు నా లక్ష్యం కులగణన మీదే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కులగణన చేపించే తీరుతుంది” అని అన్నారు.

రాహుల్ గాంధీ కులం గురించి బిజేపీ నాయకులు అవమానకర వ్యాఖ్యలు చేయడాన్ని సమాజ్ వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ ఖండించారు. ”పార్లమెంటులో ఒక సభ్యుడి కులం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఇది నిబంధనలకు వ్యతిరేకం,” అని అన్నారు.

Also Read: కేంద్ర ప్రభుత్వానికి భారీ సుప్రీం కోర్టు హెచ్చరిక.. నవంబర్ 14 లోగా..

 

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×