BigTV English

Pahalgam diaries: పహల్గాం డైరీస్: దాడి జరిగిన రోజు ఆ షాప్ క్లోజ్.. ఎందుకంటే..?

Pahalgam diaries: పహల్గాం డైరీస్: దాడి జరిగిన రోజు ఆ షాప్ క్లోజ్.. ఎందుకంటే..?

ఉగ్రదాడిలో కుట్రకోణం..?
ఉగ్రవాదులతో స్థానికులు చేతులు కలిపారా..?
ఉగ్రమూకకు స్థానికులు సాయం చేశారా..?
దాడి జరుగుతుందని వారికి ముందే తెలుసా..?


పహల్గాంలో గత నెల 22న ఉగ్రదాడి జరిగిన తర్వాత అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఉగ్రమూక అంత ధైర్యంగా పర్యాటకులు తిరిగే ప్రాంతానికి ఎలా వచ్చింది. గతంలో పలుమార్లు రెక్కీ చేసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి, అదంతా ఎలా జరిగింది..? ఉగ్రమూకకు స్థానికుల సాయం లేకపోతే ఇంత పెద్ద స్థాయిలో మారణకాండ జరిగే అవకాశం ఉందా..? అని ఎన్ఐఏ కూడా అనుమానిస్తోంది. ఆమధ్య ఒక జిప్ లైన్ ఆపరేటర్ ని ఎన్ఐఏ ప్రశ్నించింది. ఉగ్రదాడి జరుగుతున్న సమయంలోనే జిప్ లైనర్ లో ఒక పర్యాటకుడిని పంపించిన ఆపరేటర్ అల్లాహొ అక్బర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అతడిని అనుమానించి పలుమార్లు విచారణకు పిలిపించారు ఎన్ఐఏ అధికారులు. అయితే అతనికి క్లీన్ చిట్ ఇచ్చి పంపించారు.

తాజా అనుమానం..
తాజాగా మరో దుకాణదారుడిపై ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఉగ్రదాడికి ముందు 15రోజులుగా ప్రతి రోజూ ఆ షాప్ తెరిచాడు, సరిగ్గా ఉగ్రదాడి జరిగిన రోజు మాత్రం ఆ షాప్ క్లోజ్ అయింది. అదే ఎందుకు..? అనేది ఎన్ఐఏ ఆరా తీస్తోంది. ఆ షాప్ యజమానిని విచారణకు పిలిపించారు. అతడు ఉపయోగించే ఇంటర్నెట్ ప్రొటోకాల్ వివరాలు కూడా పరిశీలిస్తున్నారు.


స్థానికుల విచారణ..
దాడి జరిగిన సమయంలో స్థానికులు చాలామంది అక్కడ ఉన్నారు. కానీ ఉగ్రవాదులెవరూ వారిపై తుపాకీ గురిపెట్టలేదు. కేవలం హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసుకుని దాడి జరిగినట్టు స్పష్టమైంది. స్థానిక దుకాణదారులు తమ యాసను బట్టి వారు తమల్ని వదిలేశారని ఎన్ఐఏకి అధికారుల విచారణలో చెప్పారు. దాడి జరిగిన సమయంలో అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లు, దుకాణదారులు, పోనీ ఆపరేటర్లు, సాహస క్రీడల్లో పనిచేసేవారి వివరాలను ఎన్ఐఏ సేకరించింది. దాదాపు 100మందిని అధికారులు విచారణకు పిలిపించారు.

వారి పనేనా..?
పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రమూకకి గతంలో జరిగిన మరికొన్ని దారుణాలతో సంబంధం ఉన్నట్టు కూడా ఎన్ఐఏ అనుమానిస్తోంది. 2023 ఆగస్టులో దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ముగ్గురు ఆర్మీ సిబ్బంది హత్య జరిగింది. ఆ హత్యల్లో కూడా వీరి ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. 2024 మేలో జమ్మూలోని పూంచ్ జిల్లాలో జరిగిన దాడిలో కూడా ఉగ్రవాదులు వైమానిక సిబ్బందిని మట్టుబెట్టారు. ఇందులో కూడా పహల్గాం దాడిలో పాల్గొన్నవారి హస్తం ఉన్నట్టుగా అనుమానాలున్నాయి.

ఏ ఒక్కరినీ వదిలిపెట్టం..
పహల్గాం దాడిలో పాల్గొన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. దాడి చేసిన వారితోపాటు, వారికి సహకరించిన వారిని కూడా వదిలిపెట్టేది లేదని ఎన్ఐఏ అధికారులంటున్నారు. అనుమానితుల్ని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు. వారి తప్పేమీ లేదని తేలిన తర్వాతే వదిలిపెడుతున్నారు. దాడి జరిగే సమయంలో చుట్టుపక్కల దుకాణాలు తెరచి ఉంచిన వారిని, ముఖ్యంగా అదే రోజు షాప్ క్లోజ్ చేసిన వారిని విచారణకు పిలిపిస్తున్నారు. ఎవరైనా విచారణ నుంచి తప్పించుకోవాలని చూస్తే వారిపై నిఘా పెడుతున్నారు అధికారులు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×