BigTV English

NITI Aayog Report: నీతి అయోగ్ రిపోర్ట్.. భారత్ లో తగ్గుతున్న పేదరికం.

NITI Aayog Report: నీతి అయోగ్ రిపోర్ట్.. భారత్ లో తగ్గుతున్న పేదరికం.

Household Consumption Expenditure Survey


Household Consumption Expenditure Survey: పేదరికం మన దేశంలో 5 శాతం తగ్గిందని నీతి అయోగ్ వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం ఆగష్టు 2022 నుంచి జులై 2023 మధ్య జరిగిన గృహ వినియోగ సర్వేను ఆధారంగా తీసుకుని దీన్ని వెల్లడించినట్లు నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆయా ఏడాదుల మధ్య జరిగిన సర్వే ప్రకారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల రెండిటిలోను సర్వే ఆధారం తీసుకొని 2.5 శాతం పెరుగుదల కనిపించింది. పట్టణ ప్రాంతాలలో సగటు నెలవారి వినియోగ తలసరి వ్యయం 2011- 12 నుంచి 3.5 శాతం మేర పెరిగి 3,510 కి చేరుకుంది.

అయితే గ్రామీణ ప్రాంతాలలో మాత్రం 40.42 % పెరుగుదలలో రూ. 200,8 చేరింది. ఈ సర్వే ఆధారంగా తీసుకొని భారతదేశంలో పేదరికం 5 శాతం లేదా అంతకంటే తక్కువ పేదరికం ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ సర్వే ఆహారం పై పెడుతున్న ఖర్చు విధానాల మార్పులను కూడా గుర్తించింది.
ఆహార వ్యయం పరంగా గ్రామీణ ప్రాంతాలు 50 % కంటే తక్కువ ఆహారం వినియోగించినట్లు సర్వే తేలింది. అలాగే పట్టణ కుటుంబాలు మొత్తం వ్యయంలో 2004-05 లో 91 శాతం నుంచి 2022-23 నాటికి 71 శాతం తగ్గిందని సర్వే తెలిపింది.


ఈ సర్వే ప్రకారం ఆహారంలో ఎక్కువగా వినియోగిస్తుంది శీతల పానీయాలు, పాలు, గుడ్లు, పండ్ల వినియోగం పెరుగుతుందని వెల్లడించింది. ఈ సర్వే ఒక వైవిధ్యమైన సమతుల్య వినియోగ సూచన ఇచ్చిందని సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన హైలట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు విజయవంత మవ్వడం దీన్ని బట్టి చెప్పవచ్చు. అలాగే ఈ సర్వే ప్రకారం ఒక రకంగా పేదరికం అదృశ్యమవుతాయని చెబుతోంది. ఇది నిజంగా శుభ పరిణామం కోవిడ్ లాంటి విపత్కర పరిస్థిలనుండి తట్టుకొని మరీ ఇలా చక్కటి పురోగతి దిశగా అడుగులు వేయడం మంచి విశషం.

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×