BigTV English

Stress Free Techniques: ఇలా చేయండి.. స్ట్రెస్ ఫ్రీ అవ్వండి!

Stress Free Techniques: ఇలా చేయండి.. స్ట్రెస్ ఫ్రీ అవ్వండి!

mental health


Simple Ways to Relieve Stress : ఏమి ఉన్నా లేకున్నా మన జీవితంలో ప్రశాంతత చాలా ముఖ్యం. కానీ ఈ రోజుల్లో చాలా మంది తీవ్రమైన ఒత్తిడితో సతమతమవుతన్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబం లేదా పనిచేసే ప్రదేశంలోని కొన్ని కారణాల వల్ల స్ట్రెస్ అనేది మనిషి జీవితంలో భాగమైంది. మీరు కూడా స్ట్రెస్‌కు గురవుతున్నట్లయితే మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

మన శరీరం ఎప్పుడూ కూడా కూల్‌గా, రిలాక్స్‌గా ఉండటం చాలా ముఖ్యం. మన శరీరం స్ట్రెస్ ఫ్రీగా ఉండాలంటే కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి. ఈ నియమాలను పాటించడం వల్ల మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, హెల్దీగా ఉంటారు. ఇప్పుడు ఒత్తిడి తగ్గించేందుకు ఏయే మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం..


వ్యాయామం

వ్యాయామంతో మీ స్ట్రెస్‌ను సులభంగా దూరం చేయొచ్చు. కాబట్టి వ్యయాన్ని మీ రోజులో ఒక భాగం చేసుకోండి. వ్యయామం మీ మససుకు ప్రశాంతత ఇస్తుంది. దీని వల్ల మీ ఒత్తిడి దూరమవుతుంది. అలానే వాకింగ్, ఎక్సర్‌సైజ్, స్వమ్మింగ్ చేయండి.

Read More: మీ శరీరంలో ఈ మార్పులు ఉంటే.. బర్డ్ ఫ్లూ ఉన్నట్లే..!

శరీరాన్ని రిలాక్స్ చేయండి

శరీరంలో ఒత్తిడిని తగ్గించడానికి వ్యాయామం, ఎక్సర్‌సైజ్ తర్వాత కండరాలకు విశ్రాంతి ఇవ్వండి. ఇందుకోసం మంచి నిద్ర, మసాజ్, మొదలైనవి చేయండి. ఇలా చేయడం ద్వారా ఒత్తిడి మీ దరిచేరదు.

శ్వాస

మీరు ఒత్తిడిగా ఫీల్ అవుతుంటే.. లోతైన శ్వాస తీసుకోండి. దీనికోసం పడుకొని ధ్యానం చేయండి. లేదా మంచి ప్రశాంతత ఇచ్చే ప్రదేశంలో కూర్చొని లోతైన శ్వాస తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

సమస్యను గుర్తించండి

మీరు తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతుంటే.. మీ ఒత్తిడికి గల కారణాలకు ముందుగా తెలుసుకోండి. ఒత్తిడనేది పని, చదువు, కుటుంబం, సంబంధాలు లేదా దేనివల్ల వస్తుందో గుర్తించండి. అనంతరం దాని నుంచి కొన్ని రోజులు దూరంగా ఉండండి. ఇది ఒత్తడిని దూరం చేయడంలో సహాయపడుతుంది.

అంగీకరించడం

మీరు ఒత్తడిగా ఉన్నట్లయితే.. దానిని అంగీకరించడం చాలా ముఖ్యం. ఆ తప్పును అంగీకరించడం ద్వారా మీరు స్ట్రెస్‌ను సలుభంగా తగ్గించుకొవచ్చు.

సంగీతం

మీరు ఒత్తిడికి గురవుతున్నట్లయితే మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి. ఎందుకంటే మీకు నచ్చిన పాటను వినడం ద్వారా రిలాక్స్ అవుతారు. ఇది మీ ఒత్తిడిని దూరం చేస్తుంది. వైద్యులు కూడా ఈ సలహాను ఇస్తున్నారు.

ఆటలు

మీరు ఒత్తిడిగా ఉన్నట్లయితే గేమ్స్ కూడా ఆడండి. ఆటలు ఆడటం వల్ల చెమటలు పట్టి ఒత్తిడి దూరం అవుతుంది. అంతేకాకుండా మీ శరీరానికి ఎక్సర్‌సైజ్‌లా ఇది ఉపయోగపడుతుంది.

Disclaimer: ఆరోగ్య నిపుణుల సలహాలు , పలు వైద్య పరిశోధనలు ఆధారంగా ఈ సమాచారం అందిస్తున్నాం.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×