E-Paper
Advertisement

Indian economy : భారత ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదంటున్న అసోచామ్

Indian economy : భారత ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదంటున్న అసోచామ్
Advertisement

No threat to Indian economy: Assocham

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య పరిస్థితులు కలవరపెడుతున్న వేళ… గడ్డు కాలంలోనూ భారత ఎకానమీ దూకుడు కనబరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది… అసోచామ్. ఈ ఏడాది కూడా పటిష్ట వినియోగ డిమాండ్, మెరుగైన కార్పొరేట్‌ పనితీరు, తగ్గుముఖం పడుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తాయని అభిప్రాయపడింది.

గ్లోబల్‌ ఎకానమీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా… బలమైన దేశీయ డిమాండ్, పటిష్ట ఆర్థిక రంగం, మెరుగైన కార్పొరేట్‌ బ్యాలెన్స్‌ షీట్లు… భారత ఆర్థిక వ్యవస్థను స్థిరమైన బాటలో నిలుపుతాయంటోంది… అసోచామ్. రబీ పంటలు బాగుంటాయనే సంకేతాలతో వ్యవసాయ రంగం సానుకూల పనితీరును కనబరచవచ్చని అంచనా వేస్తోంది. ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌తో పాటు… ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, ప్రత్యేక రసాయనాలు, ఎరువుల వంటి అనేక పరిశ్రమల పనితీరు బాగుందని… పర్యాటకం, హోటళ్లు, రవాణా, గృహ కొనుగోళ్లు, విద్యుత్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్‌ విభాగాల్లోనూ చక్కటి వినియోగ డిమాండ్‌ కనిపిస్తోందని… ఇది ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని సూచిస్తుందని అసోచామ్ నివేదిక వెల్లడించింది.

Advertisement

ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల పర్యవసానాలు మన దేశంపై పడకుండా భారత్ అప్రమత్తంగా ఉండాలని అసోచామ్ హెచ్చరించింది. అంతర్జాతీయ కరెన్సీ హెచ్చుతగ్గుల విషయంలోనూ జాగ్రత్తలు అవసరమని సూచించింది. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని… ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానాలతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వెల్లడించింది. అధిక వడ్డీ రేట్ల ప్రభావం భారత కార్పొరేట్ల బ్యాలెన్స్‌ షీట్లపై కూడా పడుతున్నా… ప్రతికూల పరిస్థితులను భారత్‌ కార్పొరేట్‌ రంగం అధిగమిస్తోందని చెప్పుకొచ్చింది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేవలం 2.7 శాతం మాత్రమే వృద్ధి చెందుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసినా… భారత ఎకానమీ మాత్రం 6.8 శాతం నుంచి 7 శాతం పురోగమిస్తుందని అశాభావం వ్యక్తం చేసిన అసోచామ్… వచ్చే ఏడాది కూడా ఇదే సానుకూలత కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పింది.

Tags

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×