BigTV English

Online Bride Kill Groom: 45 ఏళ్లైనా పెళ్లికాలేదు.. స్వామీజీకి కష్టం చెప్పుకున్నాడు.. ఇంతలోనే శవమై

Online Bride Kill Groom: 45 ఏళ్లైనా పెళ్లికాలేదు.. స్వామీజీకి కష్టం చెప్పుకున్నాడు.. ఇంతలోనే శవమై

Online Bride Kill Groom| వయసు మీరుతున్నా పెళ్లి కావడం లేదని బాధపడే పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య మన దేశంలో రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే ఇదే అదునుగా తీసుకొని మోసగాళ్లు వారిని దోచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఒక ఘటనలో ఒక అమాయక పెళ్లికొడుకుని అతని ఆస్తి కోసం పెళ్లి చేసుకున్న ఒక యువతి అత్యంత కిరాతకంగా హత్య చేయించింది. ఆమె గురించి విచారణ చేయగా.. ఆమె ఒక నకిలీ పెళ్లికూతురని తెలిసింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర భారతదేశంలో అనిరుద్ధాచార్య మహారాజ్ అనే ఒక స్వామిజీ బాగా ఫేమస్. ఆయన తరుచూ తన భక్తుల కోసం ప్రజా దర్బార్ లు నిర్వహిస్తుంటారు. ఆ సభలో వచ్చే భక్తులు తమ వ్యక్తిజీవితంలో ఎదురయ్యే కష్టాలు చెప్పుకుంటూ వాటికి సమాధానం చెప్పాలని స్వామిజీని కోరుతుంటారు. అలా కొన్ని రోజుల క్రితం మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ కు చెందిన ఇంద్రకుమార్ తివారి అనే 45 వ్యక్తి స్వామిజీ దర్బార్ లో వెళ్లి అందరి ముందు తన కష్టాలను చెప్పాకున్నాడు. తనకు 45 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాలేదని.. తనకు 18 ఎకరాల భూమి ఉందని.. తాను మాత్రం ఒక టీచర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు. తన ఇల్లు, వ్యవసాయ భూమి చూసుకునేవారు.. ఎవరూ లేరని చెప్పాడు. తన సమస్యకు పరిష్కారం సూచించాలని కోరాడు.

అయితే ఆ సమయంలో స్వామిజీ ఇంద్రకుమార్ సమస్యకు సరదాగా సమాధానం చెప్పారు. అతని ఆస్తులు ప్రజా సంక్షేమం కోసం దానం చేసి.. సన్యాసం తీసుకొని సాధువుగా జీవించాలని చెప్పారు. అయితే వారిద్దరి మాటలన్నీ వీడియోగా రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో అనిరుద్ధ స్వామిజీ వీడియోలకు బాగానే వ్యూస్ వస్తుంటాయి. ఈ క్రమంలో ఇంద్ర కుమార్ తివారీ వీడియో చూసిన ఒక గ్యాంగ్ అతడిని టార్గెట్ చేసింది.


సోషల్ మీడియా ద్వారా ఇంద్ర కుమార్ కు ఖషీ తివారీ(27) అనే ఒక యువతి సంప్రదించింది. తన కంటే చాలా తక్కువ వయసు గల ఒక యువతి పైగా అందగత్తె కావడంతో ఇంద్ర కుమార్ ఎంతో సంతోషపడ్డాడు. రెండు రోజులు చాటింగ్ చేశాక.. అతనితో ఖుషీ తివారీ పెళ్లికి అంగీకరించింది. అయితే తాను ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ లో నివసిస్తున్నానని.. తనను పెళ్లి చేసుకోవాలంటే గోరఖ్ పూర్ రావాలని ఇంద్ర కుమార్ తో చెప్పింది. పెళ్లికోసం ఆగలేక పోయినా ఇంద్ర కుమార్.. ఆమెను వివాహం చేసుకోవడానికి బంగారు నగలు, నగదు తీసుకొని వెళ్లాడు. అలా వెళ్లిన ఇంద్ర కుమార్ మళ్లీ తిరిగిరాలేదు.

Also Read: ఉద్యోగంలో చేరకుండానే లక్షల్లో నష్టపరిహారం.. ఉద్యోగి హక్కులని చెప్పిన కోర్టు

ఇంద్ర కుమార్ కనిపించడం లేదని పోలీసులకు అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ లోని ఖుషీనగర్ లోని ఒక ఊరి చివర దట్టంగా ఉన్న అడవిలాంటి ప్రాంతంలో ఇంద్ర కుమార్ మృతదేహం లభించింది. అతని మెడలో ఒక కత్తి గుచ్చేసి ఉంది. పోలీసులు ఇంద్రకుమార్ హత్య కేసు విచారణ చేయగా.. అతని సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఖుషీ తివారీ గురించి తెలుసుకున్నారు. ఆమె అసలు పేరు సాహిబా బానో అని తెలిసింది. నకిలీ ఆధార్ కార్డ్ లో ఖుషీ తివారీగా పేరు మార్చుకొని ఆమె ఇంద్ర కుమార్ తివారీని ఆమె పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే ఇంద్ర కుమార్ ని హత్య చేసి మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసలు వారి కోసం గాలిస్తున్నారు.

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×