Owaisi Chandrachud| దేశంలో ప్రస్తుతం జరుగుతున్న మతరాజకీయాలలో సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రధాన కారణమని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాజస్థాన్ లోని అజ్మేర్ దర్గాలో మహాశివుని ఆలయం ఉందంటూ హిందూ సేన ఒక స్థానిక కోర్టులో పిటీషన్ వేయగా.. కోర్టు దర్గా కమిటీ, పురావస్తు శాఖ (ఎఎస్ఐ), మైనారిటీ మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేయడాన్ని అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. ‘ఆ దర్గాకు 800 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మత రాజకీయాలకు ఎప్పటికీ ఆగవా?’ అని మండిపడ్డారు.
మీడియా సమావేశంలో ఒవైసీ మాట్లాడుతూ.. “అజ్మేర్ దర్గా 800 క్రితం అల్లాఉద్దీన్ ఖిల్జీ సమయంలో ఉందని ఆధారాలు ఉన్నాయి. 13 శతాబ్దంలో ఉర్దూ కవి అమిర్ ఖుస్రో పుస్తకాల్లో కూడా అజ్మేర్ దర్గా ప్రస్తావన ఉంది. ఇప్పుడు అది దర్గా కాదు. అని మీరంటున్నారు. ఇంకేం మిగులుతుంది. ఆ దర్గాకు మన పొరుగు దేశాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులు అధికారికంగా ప్రతి సంవత్సరం వస్తుంటారు. మన దేశ ప్రధాన మంత్రి దర్గాకోసం భక్తితో చాదర్ పంపుతుంటారు. ఇప్పుడది దర్గా కాదని చెబుతారా? ఈ రాజకీయాలకు అంతం లేదా? రేపు ఒకవేళ జైనులు, బౌద్దులు కోర్టుకు వెళ్లి దేవాలయాల కింద తమ దేవుళ్ల మందిరాలున్నాయని చెబితే ఏమవుతుంది?
Also Read: మైనారిటీలను వేధించడంలో బంగ్లాదేశ్, భారత్ ఒక్కటే .. మెహ్‌బూబ ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు
దీనిపై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం జవాబు చెబుతోంది. ఆయన గత 10 ఏళ్లలో 10 సార్లు దర్గా కోసం చాదర్ పంపించారు. ఆయన ఏం సమాధానం చెబుతారు? బిజేపీ ఆర్ఎస్ఎస్ ఇవ్వన్నీ ఆపేయాలి. ఇది దేశ హితంలో లేదు. ఇప్పుడు అంతా ఏఐ జమానా జరుగుతుంటే ఇంకా ఎఎస్ఐ (పురావస్తు శాఖ) భజన చేసుకోవడం అవసరమా?. టెక్నాలజీ యుగంలో ఎఎస్ఐను నమ్ముకుని ప్రతిచోట తవ్వకాలు చేసుకుంటూ కూర్చోవాలా?. ఢిల్లీలోని బిజేపీ నాయకుడి ఇంటి కింద కూడా వందేళ్ల క్రితం పురాతన కట్టడాల ఆనవాళ్లు తప్పకుండా లభిస్తాయి. మరి అన్ని తవ్వుకుంటూ కూర్చుందామా?.. ఈ విషయాలు మన దేశాన్ని బలహీనం చేస్తున్నాయి. నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు, రైతుల ఆత్మహత్యలు, బలమైన చైనాను ఎదుర్కోవడం ఇలాంటి చాలా ముఖ్యమైన సమస్యులుండగా.. ఈ మసీదు, దర్గా, దేవాలయం లాంటి విషయాల్లోనే మనం చిక్కుకుపోయాం.
బాబ్రీ మసీదు – రామ జన్మభూమి తీర్పు సమయంలో నేను హెచ్చరించాను ఇలాంటి సమస్యలు ముందు ముందు ఇంకా తలెత్తుతాయాని. జస్టిస్ డివై చంద్రచూడ్ ఇదంతా ఆపగలిగేవారు. కానీ ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. దాని ఫలితమే ఇప్పుడు దాదాపు 15 చోట్ల మసీదు కింద గుడి ఉందని పిటీషన్లు వేస్తున్నారు.” అని ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దేశంలో 1991 ప్రార్థనా స్థలాల చట్టం ఉంది. ఈ చట్ట ప్రకారం.. 1947 స్వాతంత్ర్యం లభించిన సమయంలో ఉన్న ప్రార్థనా స్థలాలో (మసీదు ఉన్న స్థలంలో మసీదు, దేవాలయం ఉన్న దేవాలయం) ఏ మార్పు ఉండదు. అయితే అయోధ్య రామ మందిర వివాదం ఈ చట్టం చేసే సమయానికే ఉండడంతో ఆ వివాదాన్ని ఈ చట్టంలో మినహాయింపు ఇచ్చారు. కానీ జస్టిస్ చంద్రచూడ్ గ్యాన్ 1991 ప్రార్థనా స్థలాల చట్టం ఉన్నా వాపి మసీదు కేసులో మసీదు పరిసరాల్లో తవ్వకాలు జరిపేందుకు అనుమతులిచ్చారు. అక్కడ కేవలం ఎఎస్ఐ చేత సర్వే మాత్రమే చేయిస్తున్నామని.. 1947లో ఆ మసీదు స్టేటస్ గురించి స్పష్టమైన అవగాహన కోసం ఇది అవసరమని అప్పుడు ఆయన తీర్పు చెప్పారు.