India Vs Pakistan : అనుకోని ఆపద. గాల్లో 277 మంది ప్రాణాలు. ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలీనంత ఉత్కంఠ. ప్రతీ సెకన్ కీలకమే. వేరే మార్గం లేకుండా పోయింది. కాస్త సాయం చేయమని పాకిస్తాన్‌ను రిక్వెస్ట్ చేస్తే.. చేయను పొమ్మంటూ పొగరు చూపించింది. మానవత్వం లేకుండా ప్రవర్తించింది. పాపిష్టి పాక్ అసలు బుద్ధి మరోసారి బయటపెట్టుకుంది. విషయం తెలిసి ఇండియాతో సహా యావత్ ప్రపంచం ఆ నీచపు దేశంపై దుమ్మెత్తి పోస్తోంది.
పాపిష్టి పాకిస్తాన్..
పగవాడైనా ఆపదలో ఉన్నప్పుడు సహయం చేస్తాం. ఇది మనిషి ధర్మం. కానీ.. కుక్క తోక వంకర లాంటి కరుడుగట్టిన పాకిస్తాన్ మాత్రం ఈ ధర్మాన్ని మర్చిపోయింది. తినడానికి తిండి లేదు గాని పౌరుషానికి తక్కువేం లేదు. ఆర్ధికంగా దివాలా తీసి విదేశాల్లో అడుక్కు తింటున్న పాక్.. భారత్‌పై తన అక్కసును మరోసారి వెళ్లగక్కింది. పెను ప్రమాదంలో ఉన్న భారత ప్యాసింజర్ విమానంకు.. కాసేపు పాక్ గగనతలాన్ని వాడుకోవడానికి నిరాకరించి తన కసాయి బుద్ధిని మరోసారి చాటుకుంది. 277 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపంగా మారినా కూడా కనీస మానవత్వం చూపలేదు.
గాల్లో ప్రాణాలు..
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6 E 2142 విమానం.. 227 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా అనుకోని ఆపద ఎదురైంది. అమృత్‌సర్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వడగళ్ల వానతో కూడిన తుఫాను విరుచుకుపడింది. విమానం గాల్లోనే తీవ్రమైన కుదుపులకు లోనైంది. ఊహించని సడెన్ పరిణామంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. వాతావరణం అత్యంత ప్రతికూలంగా మారడంతో పైలెట్ తక్షణమే స్పందించారు. సమీపంలోని లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించారు. తమ ప్యాసింజర్ విమానాన్ని కొద్దిసేపు పాకిస్తాన్ గగనతలంలోకి అనుమతించాలని అభ్యర్థించారు. కానీ మానవత్వం లేని పాక్ అధికారులు పైలెట్ రిక్వెస్ట్‌ను తిరస్కరించారు. చేసేది లేక ఆ విపత్కర పరిస్థితుల్లోనే విమానాన్ని అతికష్టం మీద చాకచక్యంగా నడిపాడు. తుఫాను బీభత్సానికి విమానం ముందు భాగం దారునంగా డ్యామేజ్ అయింది. అయినా, పైలెట్ తన పనితనంతో ఫ్లయిట్‌ను శ్రీనగర్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Also Read : హైదరాబాద్‌లో కరోనా.. చచ్చాంరా దేవుడా..
పాక్ తీరుపై విమర్శలు..
ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు. అంతా సురక్షితంగా ఉన్నారు. పాకిస్తాన్ తీరుపై అంతా మండిపడుతున్నారు. అదేమీ ఆర్మీ ఫైటర్ జెట్ కాదని.. ఎమర్జెన్సీలో ప్యాసింజర్ ఫ్లైట్‌ను కాసేపు ఎయిర్ స్పేస్ వాడుకోనిస్తే ఏం పోయేదంటూ పాక్‌కు శాపనార్థాలు పెడుతున్నారు ఇండియన్స్.