BigTV English

Pappu Yadav: హస్తం గూటికి పప్పూ యాదవ్.. జన్ అధికార్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం..

Pappu Yadav: హస్తం గూటికి పప్పూ యాదవ్.. జన్ అధికార్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం..
Jan Adhikar Party Pappu Yadav Joined Congress
Jan Adhikar Party Pappu Yadav Joined Congress

Jan Adhikar Party Pappu Yadav Joined Congress: బీహార్ నాయకుడు పప్పు యాదవ్ బుధవారం తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, న్యూఢిల్లీలో అధికారికంగా పార్టీలో చేరారు.


ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌తో పప్పు యాదవ్ భేటీ అయిన తర్వాత విలీనంపై ఊహాగానాలు చెలరేగాయి. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కూటమికి వ్యతిరేకంగా జన్ అధికార్ పార్టీని 2015లో స్థాపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఆశీస్సులతోనే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయశానని పప్పు యాదవ్ అన్నారు.

రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించిన పప్పు యాదవ్ ఇప్పుడు దేశంలో రాహుల్ గాంధీని మించిన ప్రత్యామ్నాయం లేదని అన్నారు. లాలూజీ, కాంగ్రెస్‌తో కలిసి 2024, 2025లో విజయం సాధిస్తామని పప్పు యాదవ్ అన్నారు.


తన జన్ అధికార్ పార్టీని ప్రారంభించడానికి ముందు, పప్పు యాదవ్ RJD, సమాజ్‌వాదీ పార్టీ, లోక్ జనశక్తి పార్టీలో ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ఆర్జేడీ నుంచి పప్పు యాదవ్ బహిష్కరణకు గురైన తర్వాత జన్ అధికార్ పార్టీ ప్రస్థానం ప్రారంభమైంది.

Also Read: బీజేపీలో కుదుపులు.. కేంద్ర మంత్రి రాజీనామా..!

అయితే లాలూ యాదవ్‌తో ఎలాంటి వైరం లేదని పప్పు అన్నారు. మంగళవారం లాలూ, తేజస్విలతో ఆయన భేటీ అనంతరం బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×